క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎవరంటే.. ఠక్కున అందరూ చెప్పే మొదటి పేరు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్ధి ఎవరైనా.. ఏ బంతి విసిరినా.. సెహ్వాగ్ స్టైలే సెపరేట్.. మొదటి బంతికి బౌండరీ బాదాల్సిందే. ఇలా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించే సెహ్వాగ్.. అప్పట్లో పాకిస్తాన్ బౌలర్ రాణా నవీద్ ఉల్ హుస్సేన్‌కు చుక్కలు చూపించాడు.ఈ పాక్ బౌలర్ సెహ్వాగ్ దెబ్బకు.. కేవలం రెండు బంతుల్లోనే 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో అదే అత్యంత చెత్త ఓవర్ కావడం గమనార్హం.
సరిగ్గా 17 ఏళ్ల క్రితం. మార్చి 13, 2004న భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బౌలింగ్‌కు రాణా దిగాడు. అయితే అప్పటికే సెహ్వాగ్ మంచి ఊపు మీదున్నాడు. బౌలర్ ఎవరైనా కూడా వదలకుండా అందరినీ బెంబేలెత్తించాడు. దీనితో ఒత్తిడికి గురైన రాణా.. మొదటి బంతికే నో బాల్ వేశాడు.. సెహ్వాగ్ దాన్ని బౌండరీకి తరలించాడు. రెండో బంతి కూడా నో బాల్.. సెహ్వాగ్ ఆ బంతిని కూడా బౌండరీ కొట్టాడు. మూడో బంతి కూడా నో బాల్.. అయితే సెహ్వాగ్ ఈసారి దాన్ని మిస్ చేశాడు. ఇక నాలుగో బంతి లీగల్ డెలివరీ కాగా.. ఎలాంటి పరుగు రాలేదు. మళ్లీ ఐదో బంతిని రాణా నో బాల్ విసరగా.. సెహ్వాగ్ దాన్ని బౌండరీకి తరలించాడు. ఆరు బంతి కూడా నో బాల్ విసిరితే.. పరుగులేమి రాలేదు. చివరికి రెండో లీగల్ డెలివరీ వేయగా.. ఆ బంతిని కూడా సెహ్వాగ్ బౌండరీ కొట్టాడు.
దీనితో రెండు బంతులకే 21 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్ మొదటి రెండు బంతులు.. 4NB, 4NB, 0NB, 0, 4NB, 0NB, 4 రూపంలో సెహ్వాగ్ 21 పరుగులు రాబట్టుకున్నాడు. కాగా, క్రికెట్ ప్రపంచం ఇప్పటికీ అదే అత్యంత చెత్త ఓవర్ అని విశ్లేషకులు చెబుతారు. ఇదిలా ఉంటే రాణా ఆ ఓవర్‌లో మిగిలిన బంతులకు మూడు పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం.
రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. కుక్క ఓవర్ స్పీడ్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో
ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..
వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..