RCB vs CSK: వామ్మో.. చెన్నైతో మ్యాచ్‌ కోసం కోహ్లీ మాస్టర్‌ ప్లాన్‌? ఇంట్రెస్టింగ్‌ మ్యాటర్‌ బయటపెట్టిన DK

|

Mar 28, 2025 | 11:24 AM

RCB, CSK మధ్య జరిగే ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో చెన్నై స్పిన్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా విరాట్ కోహ్లీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. కోహ్లీ స్పిన్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. చెపాక్ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో, ఆర్సీబీ స్పిన్ దాడిని ఎదుర్కొనేందుకు కొత్త షాట్లను ప్రయత్నించనుంది.

RCB vs CSK: వామ్మో.. చెన్నైతో మ్యాచ్‌ కోసం కోహ్లీ మాస్టర్‌ ప్లాన్‌? ఇంట్రెస్టింగ్‌ మ్యాటర్‌ బయటపెట్టిన DK
Virat Kohli
Follow us on

క్రికెట్అభిమానలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌.. ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే. ఐపీఎల్‌లో ఈ మ్యాచ్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. ఎందుకంటే.. ఒక వైపు విరాట్‌ కోహ్లీ, మరోవైపు మహేంద్ర సింగ్‌ ధోని ఉన్నారు. అందుకే ఈ మ్యాచ్‌ అంత డిమాండ్‌. ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడుతన్నాయి. చెపాక్‌ పిచ్‌ అనగానే స్పిన్‌ బౌలింగ్‌ గుర్తుకువస్తుంది. ఇక్కడ స్పిన్నర్లదే హవా.. ఆ బలంతోనే తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది సీఎస్‌కే. ఇప్పుడు ఆర్సీబీని కూడా స్పిన్‌తోనే దెబ్బతియాలని భావిస్తోంది. పైగా ఆర్సీబీకి ప్రధాన బలమైన విరాట్‌ కోహ్లీ ఎలాగో స్పిన్‌ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేడనే ఒక వాదన ఉంది. ఆ బలహీనతపైనే ఫోకస్‌ పెట్టి.. ఆర్సీబీని ఓడించాలని సీఎస్‌కే ప్లాన్‌ చేస్తోంది.

అయితే.. సీఎస్‌కే మ్యాచ్‌ కోసం విరాట్‌ కోహ్లీ ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు, ఆర్సీబీ మెంటర్‌ కమ్‌ బ్యాటింగ్‌ కోచ్ దినేష్‌ కార్తీక్‌ వెల్లడించాడు. కోహ్లీ స్పిన్‌ బౌలింగ్‌లో కాస్త తడబడుతున్నాడనేది వాస్తవమే అయినా.. గత కొంత కాలంగా ఆ వీక్‌నెస్‌ను ఓవర్‌కమ్‌ చేస్తూ వస్తున్నాడు. స్లాగ్‌స్వీప్‌ ఆడుతూ.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇదే విషయంపై డీకే మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీ స్పిన్‌ బౌలింగ్‌ ఆడటంలో చాలా మెరుగయ్యాడు. మీరు చూసుకుంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో, అలాగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎలాంటి బ్యాటింగ్‌ చేశాడో చూశాం.. స్పిన్నర్లను సరిగ్గా ఆడకుంటే అది సాధ్యమయ్యే పని కాదు.

ఇప్పటికీ కూడా విరాట్‌ కోహ్లీ ఏదో ఒక కొత్త షాట్‌ను నేర్చుకోవాలని, దాన్ని తన బ్యాటింగ్‌ స్కిల్స్‌లో చేర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా సీఎస్‌కే మ్యాచ్‌కి ముందు కూడా ఒక కొత్త షాట్‌ను ట్రై చేస్తున్నాడంటూ డీకే వెల్లడించాడు. ఎలాగో చెపాక్‌లో స్పిన్నర్ల డామినేషన్‌ ఉంటుంది, అలాంటి పిచ్‌పై కాస్త అగ్రెసివ్‌ అప్రోచ్‌ చూపిస్తూ.. స్పిన్నర్లకు వ్యతిరేకంగా డిఫరెంట్‌ షాట్స్‌ ఆడాలని కోహ్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కూడా కోహ్లీ తన సహజ ఆటతీరుకు భిన్నంగా అగ్రెసివ్‌ అప్రోచ్తో బ్యాటింగ్‌ చేశాడు. ఈ సీజన్‌ మొత్తం అదే ఇంటెంట్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..