AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Video: మరీ ఇంత చీప్‌గానా..! అరంగేట్ర ప్లేయర్‌పై కోహ్లీ రియాక్షన్.. దుమ్మెత్తిపోస్తోన్న నెటిజన్లు

Virat Kohli's Alleged 'Pani Pilata Hai' Gesture On Musheer Khan: ముషీర్ ఖాన్‌కు ఇది గుర్తుంచుకోదగిన అరంగేట్రం కాదు. అతను కేవలం మూడు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అయితే, బౌలింగ్‌లో మాత్రం ఒక వికెట్ తీసి తన తొలి ఐపీఎల్ వికెట్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. క్రికెట్ అభిమానుల మధ్య విరాట్ కోహ్లీ ప్రవర్తనపై తీవ్ర చర్చకు ఇది దారితీసింది.

Virat Kohli Video: మరీ ఇంత చీప్‌గానా..! అరంగేట్ర ప్లేయర్‌పై కోహ్లీ రియాక్షన్.. దుమ్మెత్తిపోస్తోన్న నెటిజన్లు
Virat Kohli Vs Musheer Khan
Venkata Chari
|

Updated on: May 30, 2025 | 12:11 PM

Share

Virat Kohli’s Alleged ‘Pani Pilata Hai’ Gesture On Musheer Khan: ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు భారత టెస్ట్ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్  ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రంలో ప్రత్యేకంగా నిలవలేకపోయాడు. అయితే, ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చేసిన ఓ సిగ్నల్‌తో.. ఈ యువ ప్లేయర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

అసలేం జరిగింది?

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ ఔట్ అయిన తర్వాత ముషీర్ ఖాన్ ‘ఇంపాక్ట్ ప్లేయర్‌’గా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది ముషీర్‌కు ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ మాత్రమే కాదు, అతని ప్రొఫెషనల్ టీ20 కెరీర్‌లో కూడా ఇదే మొదటి మ్యాచ్. పంజాబ్ కింగ్స్ అప్పటికే 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ముషీర్ బ్యాటింగ్ చేయడానికి వస్తుండగా, స్లిప్స్‌లో నిలబడిన విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. అతని పెదవుల కదలికలు, సంజ్ఞల ఆధారంగా, కోహ్లీ “ఈ పాణి పిల్తా హై” (ఇతను నీళ్ళు అందిస్తాడు) అని అన్నట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

విరాట్ కోహ్లీ ఉద్దేశ్యం ఏమిటి?

ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీ యువ ఆటగాడిని కించపరిచాడని ఆరోపిస్తున్నారు. మ్యాచ్‌కు ముందు ముషీర్ ఖాన్ డ్రింక్స్ అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ, కోహ్లీ ఆ సమయంలో డ్రింక్స్ అందించిన వ్యక్తి ఇప్పుడు బ్యాటింగ్‌కు వస్తున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. క్రికెట్‌లో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు స్లెడ్జింగ్ చేసుకోవడం సాధారణమే అయినప్పటికీ, అరంగేట్రం చేస్తున్న యువ ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.

నిజానికి, ఈ సీజన్‌లోనే విరాట్ కోహ్లీ, ముషీర్ ఖాన్‌కు తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ముషీర్ కూడా విరాట్ కోహ్లీని ‘భయ్యా’ అని పిలుస్తూ, అతని పట్ల ఎంతో గౌరవం చూపాడు. ఈ నేపథ్యంలో, కోహ్లీ ఉద్దేశపూర్వకంగా ముషీర్‌ను కించపరిచి ఉండకపోవచ్చని, బహుశా ఇది ఆటలో భాగంగా చేసిన ఒక వ్యాఖ్య అయి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ముషీర్ ఖాన్ అరంగేట్రం..

ముషీర్ ఖాన్‌కు ఇది గుర్తుంచుకోదగిన అరంగేట్రం కాదు. అతను కేవలం మూడు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అయితే, బౌలింగ్‌లో మాత్రం ఒక వికెట్ తీసి తన తొలి ఐపీఎల్ వికెట్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. క్రికెట్ అభిమానుల మధ్య విరాట్ కోహ్లీ ప్రవర్తనపై తీవ్ర చర్చకు ఇది దారితీసింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..