Virat Kohli Birthday: ఇలా చేస్తానని అస్సలు ఊహించలేదు: 35వ పుట్టినరోజుకు ముందు కింగ్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Nov 01, 2023 | 6:53 PM

Virat Kohli, ICC World Cup 2023: ఈ 12 ఏళ్లలో ఇన్ని పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది. ఒకానొక సమయంలో నేను ప్రొఫెషనల్ క్రికెట్‌లో నా లోపాలను గుర్తించాను. కాబట్టి ప్రతిదీ బాగానే జరిగింది. నా దృష్టి అంతా జట్టుపైనే. టీమ్ ఇండియా విజయానికి ధీటుగా రాణించి, కష్ట సమయాల్లో కూడా జట్టును ఆదుకోవడమే నా లక్ష్యం. అందుకే నా జీవనశైలిని మార్చుకున్నాను. కఠినమైన క్రమశిక్షణ అవసరమని నేను భావించాను.

Virat Kohli Birthday: ఇలా చేస్తానని అస్సలు ఊహించలేదు: 35వ పుట్టినరోజుకు ముందు కింగ్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Virat Kohli Birthday
Follow us on

ODI ప్రపంచకప్ (ICC World Cup 2023)లో ఆతిథ్య భారత్‌ అజేయంగా కొనసాగుతోంది. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన ఇప్పుడు ముంబైలోని వాఖండే స్టేడియంలో తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు (India vs Sri Lanka)తో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 5న ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చాలా కీలకం. ఎందుకంటే నవంబర్ 5న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో గెలిచి క్రికెట్ ప్రపంచ రారాజుకు విజయాన్ని కానుకగా ఇవ్వాలని టీమ్ ఇండియా ఆలోచిస్తోంది. అయితే అంతకు ముందు కింగ్ కోహ్లీ తన కెరీర్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు.

ఇలా చేస్తానని ఆలోచించలేదు..

ఈ వన్డే ప్రపంచకప్‌లో తన 48వ సెంచరీని సాధించడం ద్వారా భారత గ్రేటెస్ట్ బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) వన్డే సెంచరీల రికార్డును సమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన గురించి స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, ‘ నా క్రికెట్ జీవితంలో ఈ స్థాయికి చేరుకుంటాను అని నేను ఎప్పుడూ ఇలా అనుకోలేదు. భగవంతుని దయ వల్ల నేను ఇలా ఉన్నాను. నా పనితీరు, స్థిరత్వం కొనసాగుతుంది. వందలు సాధించి, వేల పరుగులు సాధించాలని కలలుగన్నట్లయితే.. దాన్ని సాధిస్తారు. అయితే అవన్నీ ఒక్కొక్కటిగా మెటీరియలైజ్ అవుతాయని అనుకోలేదు. నిజం చెప్పాలంటే, క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతాయి. ప్రయాణం ఇలా సాగాలని ఎవరూ ప్లాన్ చేయరు’ అంటూ చెప్పుకొచ్చాడు.

కఠినమైన క్రమశిక్షణ అవసరం..

‘ఈ 12 ఏళ్లలో ఇన్ని పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది. ఒకానొక సమయంలో నేను ప్రొఫెషనల్ క్రికెట్‌లో నా లోపాలను గుర్తించాను. కాబట్టి ప్రతిదీ బాగానే జరిగింది. నా దృష్టి అంతా జట్టుపైనే. టీమ్ ఇండియా విజయానికి ధీటుగా రాణించి, కష్ట సమయాల్లో కూడా జట్టును ఆదుకోవడమే నా లక్ష్యం. అందుకే నా జీవనశైలిని మార్చుకున్నాను. కఠినమైన క్రమశిక్షణ అవసరమని నేను భావించాను. ఆట ఎల్లప్పుడూ మన ప్రయత్నాలను గుర్తిస్తుంది. ఇది నా కెరీర్‌లో నేను నేర్చుకున్న అత్యుత్తమ విషయం. మైదానంలో 100% అంకితభావంతో ఆడేందుకు కష్టపడ్డాను. ఇదంతా దేవుడి దీవెనలుగా భావిస్తున్నాను’ అంటూ కోహ్లీ తెలిపాడు.

నవంబర్ 5న కోహ్లీ 35వ పుట్టినరోజు..

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లి ఇప్పటికే ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో సహా 354 పరుగులు చేశాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం నవంబర్ 5న కోహ్లీ తన 35వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అదే రోజు సౌతాఫ్రికాతో మ్యాచ్ ఉన్నందున.. ఆ రోజున కింగ్ కోహ్లి సెంచరీ కొట్టాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు.

ఈడెన్ గార్డెన్స్‌లో వేడుక..

మరోవైపు, బెంగాల్ క్రికెట్ బోర్డు (క్యాబ్) ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీకి ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలను ప్లాన్ చేసింది. ఐసీసీ అనుమతితో మ్యాచ్‌కు ముందు భారీ కేక్‌ను కట్ చేయాలన్న ప్రతిపాదన ఉంది. దీంతో పాటు మైదానానికి వచ్చే దాదాపు 70 వేల మంది ప్రేక్షకులకు కోహ్లీ మాస్క్‌లు ఇస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో స్టేడియం మొత్తం ఉత్కంఠతో మారుమోగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..