AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ఒక్క ప్లేస్.. మూడు ఆఫ్షన్స్.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ..

Team India openers for IND vs AFG: ఓపెనింగ్ జోడీ కోసం టీమ్ ఇండియాకు 3 ఆప్షన్లు ఉన్నాయి. అయితే, ఈ ముగ్గురిలో ఏ జోడీతో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఓపెనింగ్ చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం జట్టు మేనేజ్‌మెంట్ నుంచి రావాల్సి ఉంది. మేనేజ్మెంట్ ఏమి ఆలోచిస్తుందో చూడాలి. టీమ్ ఇండియా ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండనుందో మరో రెండు రోజులు ఎదురుచూడక తప్పదు.

IND vs AFG: ఒక్క ప్లేస్.. మూడు ఆఫ్షన్స్.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ..
Team India
Venkata Chari
|

Updated on: Jan 09, 2024 | 5:15 PM

Share

Ind vs Afg T20 Series: ఒక స్థానం. మూడు ఎంపికలు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఓపెనింగ్ జోడీ విషయంలో టీమిండియా ముందున్న కీలక ప్రశ్న ఇది. మొత్తానికి, టీమిండియా ఓపెనింగ్ జోడీ ఏది? 3 ఎంపికలలో ఏది మంచిది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ముందు, 3 ఎంపికలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం? ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టులో మూడు ఓపెనింగ్ ఆప్షన్‌లలో తొలి జోడీ రోహిత్-యశస్వి. రెండో జోడీ రోహిత్, గిల్ కాగా, మూడో జోడీ రోహిత్, విరాట్.

అయితే, ఏ ఓపెనింగ్ జోడిలోనైనా రోహిత్ శర్మ ఓ ప్లేయర్‌గా ఉండడం గమనార్హం. ఇటువంటి పరిస్థితిలో, ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో మూడు ఎంపికలలో ఏది ప్రయత్నించినా, మారేది రోహిత్ శర్మ భాగస్వామి మాత్రమే. అయితే, బరిలోకి దిగే జోడీ ఏది? ఈ ప్రశ్న ఏందుకు వచ్చిందే.. యశస్వి, గిల్, విరాట్ ముగ్గురూ ఏదో ఒక ఫార్మాట్‌లో రోహిత్‌తో ఓపెనింగ్ చేస్తూ రికార్డులు సృష్టించారు. అయితే, ఇక్కడ ప్రశ్న టీ20 ఇంటర్నేషనల్ గురించి కావడం విశేషం.

రోహిత్-యశస్వి జోడీ..

ముందుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జోడీ గురించి మాట్లాడుకుందాం. ఈ జోడి క్రికెట్‌లోని ఇతర ఫార్మాట్లలో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం కనిపించింది. ఇది టెస్ట్ ఫార్మాట్‌లో కూడా పెద్ద భాగస్వామ్యాలను నెలకొల్పింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా ఓపెనింగ్‌కు వస్తే, ఇది టీ 20 ఫార్మాట్‌లో మొదటిసారి కనిపిస్తుందన్నమాట.

రోహిత్, గిల్ జోడీ..

ఓపెనింగ్ జోడీగా టీమిండియాకు రెండో ఆప్షన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్. రోహిత్- గిల్, రోహిత్-యశస్వి జోడీకి ఏమాత్రం భిన్నంగా లేదు. అంటే, వారికి అవకాశం దొరికితే, వారిద్దరూ కూడా మొదటిసారి T20 ఇంటర్నేషనల్‌లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం చూడొచ్చు.

రోహిత్-విరాట్ 29 మ్యాచ్‌ల్లో ఓపెనర్లు..

టీమిండియా ఓపెనింగ్ జోడీలో మూడో, చివరి ఆప్షన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరిద్దరూ కలిసి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్‌కు ఓపెనింగ్ చేయడం మనం ఇంతకు ముందు చూశాం. రోహిత్-విరాట్ జంట 29 T20 మ్యాచ్‌లలో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇందులో వారు 40 సగటుతో 1160 పరుగులు జోడించారు. వీరి మధ్య 138 పరుగుల అతిపెద్ద భాగస్వామ్యం నెలకొంది.

రోహిత్‌పై యశస్వి ఎందుకు పైచేయి సాధించాడు?

అంటే, ఓవరాల్‌గా చూస్తే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికైన టీమ్‌ఇండియాలో ఓపెనింగ్ జోడీకి సంబంధించిన మూడు ఆప్షన్‌లలో.. అత్యంత అనుభవజ్ఞుల గురించి ఆలోచిస్తే.. అది రోహిత్-విరాట్ జోడీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, భారత్ ఎడమచేతి-కుడిచేతి కలయిక గురించి ఆలోచిస్తే, అది రోహిత్-జైస్వాల్ గురించి ఆలోచించవచ్చు.

గత టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు గిల్, విరాట్‌ల కంటే ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది. ఇది మాత్రమే కాదు, పవర్‌ప్లేలో అతని స్ట్రైక్ రేట్ మరింత పెరుగుతుంది. దీని వలన అతను గిల్, విరాట్‌లపై పైచేయి సాధించాడు. అయితే, ఇది గణాంకాలకు సంబంధించిన విషయం మాత్రమే. ఈ మూడు ఎంపికలలో ఓపెనింగ్ జోడీగా ఎవరిని ప్రయత్నించాలి అనే విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..