
ICC ODI World Cup 2023: గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 2023లో 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు.
కోహ్లి ఇప్పుడు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 ODI పరుగులకు పైగా ఎనిమిది సార్లు పూర్తి చేశాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఇదివరకు చేసిన ఏడుసార్ల రికార్డులను విరాట్ కోహ్లీ అధిగమించాడు.
2017 వన్డే క్రికెట్‌లో కోహ్లీ 26 ఇన్నింగ్స్‌ల్లో 1460 పరుగులు సాధించాడు. 2023, 2019, 2018, 2017, 2014, 2013, 2012, 2011లో వన్డేల్లో 1000 పరుగులకుపైగా సాధించాడు.
48 సెంచరీలతో కోహ్లీ వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టెండూల్కర్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. పేసర్ దిల్షాన్ మధుశంక చేతికి చిక్కిన విరాట్ కోహ్లీ 88 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ప్రపంచకప్‌లో శ్రీలంకకు 358 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. గురువారం వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి 350+ పరుగులు చేసింది.
భారత్ తరపున శుభ్‌మన్ గిల్ 92 పరుగులు, విరాట్ కోహ్లీ 88 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 5 వికెట్లు తీశాడు. దుష్మంత చమీరకు ఒక వికెట్ దక్కింది.
358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు సిరాజ్, బుమ్రా, షమీ వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. వార్తలు రాసే సమయానికి శ్రీలంక 13.1 ఓవర్లలో 29 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక: కుసాల్ మెండిస్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక, దుషన్ హేమంత, సదీర సమరవిక్రమ, మహేశ్ తీక్షన, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..