IND vs WI: విండీస్‌ టూర్‌ నుంచి ఈ స్టార్‌ ఆటగాళ్లు ఔట్‌.. ఆ యంగ్ ప్లేయర్లకు బంపరాఫర్‌

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం స్వదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తమ కుటుంబాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక భారత జట్టు తన తదుపరి సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. కరీబియన్ దీవుల్లో టీమ్ ఇండియా టూర్‌ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది.

IND vs WI: విండీస్‌ టూర్‌ నుంచి ఈ స్టార్‌ ఆటగాళ్లు ఔట్‌.. ఆ యంగ్ ప్లేయర్లకు బంపరాఫర్‌
India Vs West Indies

Updated on: Jun 18, 2023 | 8:33 AM

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం స్వదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తమ కుటుంబాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక భారత జట్టు తన తదుపరి సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. కరీబియన్ దీవుల్లో టీమ్ ఇండియా టూర్‌ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. టూర్‌లో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ టూర్ నుంచి కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి లభించే అవకాశం ఉందని తెలుస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు లేదా వైట్‌బాల్ సిరీస్‌లో రోహిత్‌ని పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. విరాట్‌ కోహ్లీకి కూడా ఇది వర్తించే అవకాశం ఉంది. సిరాజ్, షమీ మొత్తం టూర్‌కు దూరమయ్యే ఛాన్స్‌ ఉంది.

ఐపీఎల్‌ హీరోలకు బంపరాఫర్‌..

వెస్టిండీస్ ప్రస్తుతం బలమైన జట్టుగా కనిపించనప్పటికీ, భారత సెలక్షన్ కమిటీ మరింత మంది యువ ఆటగాళ్లకు ఛాన్సులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ఉమ్రాన్ మాలిక్, రింకూ సింగ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ వంటి కొంతమంది ఆటగాళ్లు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నారు. జైస్వాల్, అర్ష్‌దీప్‌లు టెస్టు జట్టులోకి కూడా వస్తారని తెలుస్తోంది. ఇక వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును జూన్ 27న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించనుంది.

షెడ్యూల్‌ ఇదే..

టీమిండియా వెస్టిండీస్‌ పర్యటన రెండు టెస్టులతో ప్రారంభం కానుంది. తొలి టెస్టు జూలై 12 నుంచి 16 వరకు, రెండో టెస్టు జూలై 20 నుంచి 24 వరకు ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు జూలై 27, 29, ఆగస్టు 1 తేదీల్లో జరగనున్నాయి.. చివరగా, ఆగస్టు 3న బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరిగే తొలి మ్యాచ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 6, 8 తేదీల్లో రెండో, మూడో టీ20, ఆగస్టు 12న 4వ మ్యాచ్, ఆగస్టు 12న ఐదో, చివరి మ్యాచ్. 13న ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..