- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli started the fight, caught my hand forcefully says Naveen Ul Haq
Virat Kohli vs Naveen Ul Haq: కోహ్లీయే మొదలెట్టాడు.. నా తప్పేమీ లేదు.. నవీన్ ఉల్ హక్ షాకింగ్ కామెంట్స్
నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదలైన మాటల యుద్ధం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగింది. ముఖ్యంగా, ఈ వాదనలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా రావడంతో గొడవ మరింత పెద్దదిగా మారింది.
Updated on: Jun 17, 2023 | 10:02 PM

ఐపీఎల్ 16వ సీజన్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా కింగ్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగింది.

నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదలైన మాటల యుద్ధం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగింది. ముఖ్యంగా, ఈ వాదనలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా రావడంతో గొడవ మరింత పెద్దదిగా మారింది.

దీంతో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లకు మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించగా, నవీన్ ఉల్ హక్‌కు మ్యాచ్ ఫీజులో 50% కోత విధించారు. ఇప్పుడు ఈ ఘటనపై నవీన్ ఉల్ హక్ మరోసారి బహిరంగంగా మాట్లాడాడు

ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్.. ఐపీఎల్‌లో గొడవలకు విరాట్ కోహ్లీయే ప్రధాన కారణమన్నాడు. అతనే దీనిని ప్రారంభించాడని, అందులో తన తప్పేమీ లేదని ఆఫ్ఘన్ ప్లేయర్ చెప్పాడు.

నేను స్లెడ్జ్ చేయకపోయినా విరాట్ కోహ్లీ నాతో గొడవ పెట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా నా చేయి పట్టుకుని లాగి మళ్లీ గొడవకు దిగాడంటే నవీన్ పేర్కొన్నాడు. మొత్తంమీద, చాలా మంది ఆటగాళ్ళు IPL సీజన్ 16 లో ఆటలో రికార్డులతో దృష్టిని ఆకర్షిస్తే నవీన్-ఉల్-హక్ కింగ్ కోహ్లీతో గొడవపడి క్రేజ్ సంపాదించాడు.




