Virat Kohli: చెన్నైతో మ్యాచ్‌కు ముందు షాకింగ్ న్యూస్ చెప్పని కోహ్లీ.. 2 సార్లు నా హార్ట్ బ్రేక్ అంటూ..

|

May 18, 2024 | 3:11 PM

Virat Kohli Heart Break: ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి CSKతో జరిగిన మ్యాచ్‌కి ముందు, మహేంద్ర సింగ్ ధోని చెన్నైని ఎదుర్కొనేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు. కోహ్లీ 2016 సంవత్సరంలో తన గుండె రెండుసార్లు పగిలిపోయిందని, దీంతో గదిలోకి వెళ్లి బయటకు రాలేదంటూ చెప్పుకొచ్చాడు.

Virat Kohli: చెన్నైతో మ్యాచ్‌కు ముందు షాకింగ్ న్యూస్ చెప్పని కోహ్లీ.. 2 సార్లు నా హార్ట్ బ్రేక్ అంటూ..
Virat Kohli
Follow us on

Virat Kohli Heart Break: ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ హార్ట్ బ్రేక్ అయింది. మహేంద్ర సింగ్ ధోని చెన్నైని ఎదుర్కొనే ముందు, కోహ్లీ 2016 సంవత్సరంలో తన గుండె రెండుసార్లు పగిలిపోయిందని, దీంతో గదిలోకి వెళ్లి బయటకు రాలేదంటూ చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్ గురించి విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?

వాస్తవానికి, 2016 సంవత్సరం T20 ప్రపంచ కప్ టీమిండియా సెమీ-ఫైనల్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. విరాట్ కోహ్లీ కూడా జట్టులో భాగమయ్యాడు. ఈ ఓటమిని గుర్తు చేసుకుంటూ జియో సినిమాతో మాట్లాడిన కోహ్లీ.. క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే హార్ట్ బ్రేక్ అయ్యింది. 2016లో టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయినప్పుడు, దాని నుంచి కోలుకోలేకపోయాను. ఆ టోర్నీలో నేను ఏదైనా చేయగలనని ఎప్పుడూ భావించాను. కానీ, మేం ఓడిపోయినప్పుడు, నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. మరుసటి రోజు నా గది నుంచి బయటకు రాలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఫైనల్లో ఆర్సీబీ ఓటమితో మరోసారి..

T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌ తర్వాత మరో రెండు నెలలకు కోహ్లికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అతని కెప్టెన్సీలో RCB IPL 2016 ఫైనల్‌లో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. మేం ఫైనల్‌కు చేరిన విధానం, ట్రోఫీ మా చేతిలోనే అని నేను భావించాను. ఫైనల్‌లో కూడా చివరి 42 బంతుల్లో 68 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. మేం ఎలా ఓడిపోయామో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ తర్వాత హోటల్‌కి చేరుకునే సరికి అక్కడ విజయోత్సవ సంబరాలకు పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, ఒక్కరు కూడా దిగి రాకపోవడంతో ఓటమితో అందరూ నిరాశ చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..