Team India: ఈ ప్లేయర్ ఎంట్రీతో శ్రేయాస్ అయ్యర్‌కు ఎఫెక్ట్.. భారత మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు..

|

Jun 15, 2022 | 9:28 PM

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి తిరిగి వచ్చిన తర్వాత, ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భారత జట్టు నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని మాజీ భారత ఆటగాడు బాంబ్ పేల్చాడు.

Team India: ఈ ప్లేయర్ ఎంట్రీతో శ్రేయాస్ అయ్యర్‌కు ఎఫెక్ట్.. భారత మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు..
Shreyas Iyer
Follow us on

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ నిశ్శబ్దంగా మారింది. నిజానికి ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ అంతగా ఆకట్టుకోలేదు. కాగా, ఈ ఆటగాడిపై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ ఫ్లాప్ షో ఇలాగే కొనసాగితే సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి పునరాగమనం తర్వాత అతను జట్టుకు దూరంగా ఉండాల్సి రావచ్చని అభిప్రాయపడ్డాడు. తిరిగి వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ నంబర్-3లో బ్యాటింగ్ చేస్తాడని, ఇటువంటి పరిస్థితిలో, శ్రేయాస్ అయ్యర్ జట్టు భారత జట్టు నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

‘విరాట్ కోహ్లీ ఎంట్రీతో అయ్యర్‌కు సెలవులు..’

దక్షిణాఫ్రికాతో జరిగే 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించడం గమనార్హం. కాగా, గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో భారత జట్టులో లేడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 27 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కాగా రెండో టీ20లో 35 బంతుల్లో 40, మూడో మ్యాచ్‌లో 11 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు.

ఇవి కూడా చదవండి

మూడో టీ20లో భారత్ ఘన విజయం..

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయంతో సిరీస్‌లో భారత జట్టు 1-2తో నిలిచింది. ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ శుక్రవారం రాజ్‌కోట్‌లో జరగనుంది.