Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ చేస్తే రూ. 8.9 కోట్లు.. విరాట్ కోహ్లీ మొత్తం సంపాదన తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

|

Jun 21, 2023 | 6:59 AM

Virat Kohli's Networth: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ. 8.9 కోట్లు వసూలు చేస్తాడంట. అదే సమయంలో ట్విట్టర్ పోస్ట్‌లకు రూ.2.5 కోట్లు వసూలు చేస్తాడంట.

Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ చేస్తే రూ. 8.9 కోట్లు.. విరాట్ కోహ్లీ మొత్తం సంపాదన తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Virat Kohli
Follow us on

Virat Kohli’s Networth: భారత్‌లో క్రికెట్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. టీమ్‌తో పాటు క్రికెటర్లంటే భారత అభిమానులకు ఎంతో ఇష్టం. భారత్‌లో చాలా మంది ప్రముఖ క్రికెటర్లు ఉన్నారు. ప్రస్తుతం భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌. ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకడు కావడానికి ఇదే కారణం. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లి కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకుగాను రూ.8.9 కోట్లు వసూలు చేస్తాడంట.

బెంగళూరు ఆధారిత కంపెనీ స్టాక్‌గ్రో ప్రకారం, విరాట్ కోహ్లీ మొత్తం నికర విలువ రూ. 1000 కోట్లు దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి విరాట్ కోహ్లి రూ. 8.9 కోట్లు, ట్విట్టర్ పోస్ట్ కోసం రూ. 2.5 కోట్లు వసూలు చేస్తాడని నివేదికలో పేర్కొంది.

విరాట్ కోహ్లీ క్రికెట్‌తో పాటు ఏ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నాడంటే..

కింగ్ కోహ్లీ బీసీసీఐ A+ గ్రేడ్ ఆటగాడు. అతని వార్షిక వేతనం రూ.7 కోట్లుగా ఉంది. కోహ్లీకి టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 3 లక్షలు, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు రూ. 3 లక్షలు ఇస్తుంటారు. ఇది కాకుండా విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.15 కోట్లు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

స్టాక్‌గ్రో నివేదికల ప్రకారం, క్రికెట్‌తో పాటు, బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, MPL, స్పోర్ట్స్ కాన్వోతో సహా పలు స్టార్టప్‌లలో కోహ్లీ పెట్టుబడి పెట్టాడు. ఇది కాకుండా ఈ భారత బ్యాట్స్‌మెన్ దాదాపు 18 బ్రాండ్‌లతో పని చేస్తున్నాడు. ఒక రోజు ప్రకటన కోసం రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేస్తారు.

వీటన్నింటితో పాటు కోహ్లీకి ఫుట్‌బాల్, టెన్నిస్, రెజ్లింగ్ జట్లతో సహా వివిధ క్రీడా జట్లు కూడా ఉన్నాయి. కోహ్లీ ఇళ్ల గురించి మాట్లాడితే.. ముంబైలో ఒకటి, గుర్గావ్‌లో రెండు ఇళ్లు ఉన్నాయి. ఇందులో ముంబై వన్ ధర గురించి మాట్లాడితే.. సుమారు రూ.34 కోట్లుగా ఉంది. అలాగు గుర్గావ్ ఇంటి ధర సుమారు రూ.80 కోట్లుగా ఉంది. ఇది కాకుండా, కోహ్లీ అనేక దుస్తుల బ్రాండ్లు, రెస్టారెంట్లకు యజమానిగానూ ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..