
ఐపీఎల్ 16వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా ఆరంభించింది. ఆదివారం చిన్న స్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై విధించిన172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లి(49 బంతుల్లో 82 నాటౌట్) తన ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. కెప్టెన్ డుప్లెసిస్( 43 బంతుల్లో 73)తో కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో డుప్లెసిస్, కార్తీక్ ఔటౌనప్పటికీ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మిగతా పనిని పూర్తి చేశారు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్, కామెరూన్ గ్రీన్ తలా ఓ వికెట్ తీశారు. ఓ సూపర్బ్ క్యాచ్‌తో పాటు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో బెంగళూరును గెలిపించిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబయిని తిలక్ వర్మ (84 నాటౌట్; 46 బంతుల్లో 9×4, 4×6) సూపర్బ్ ఇన్నింగ్స్‌తో ఆడుకున్నాడు.
అయితే తిలక్ వర్మ పోరాటాన్ని ముంబై సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆజట్టు బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కోహ్లీ 7 పరుగుల వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అర్చర్ వదిలిపెట్టేశాడు. దీనికి ముంబై భారీ మూల్యమే చెల్లించింది. జీవనాదానంతో బతికిపోయిన కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరోవైపు డుప్లెసిస్ పరుగులు తీసేకంటే బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపేందుకే ప్రయత్నించాడు. ఇలా ఒకరికొకరు పోటీ పడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లే అయ్యేసరికి 53 పరుగులు చేసిన ఆర్సీబీ.. 11వ ఓవర్లోనే వంద దాటేసింది. డుప్లెసిస్ 29 బంతుల్లో, కోహ్లి 38 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే విజయానికి 32 బంతుల్లో 24 పరుగులే చేయాల్సిన స్థితిలో డుప్లెసిస్ ఔటయ్యాడు. ఆ వెంటనే కార్తీక్ కూడా (0) కూడా వెనుదిరిగాడు. తర్వాత కోహ్లి, మ్యాక్స్‌వెల్ (12 నాటౌట్; 3 బంతుల్లో 2×6) ధాటిగా ఆడడంతో 22 బంతులుండగానే బెంగళూరు విజయం సాధించింది.
The 6️⃣ that sealed ✌️ points for us in our season opener tonight. ?#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvMI
— Royal Challengers Bangalore (@RCBTweets) April 2, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..