Virat kohli: ఎవ్వరికి అందదు అతని రేంజ్.. బ్రాండ్ వ్యాల్యూలో కోహ్లీకి టాప్ ప్లేస్.. టాప్-5లో ఎవరున్నారంటే?

భారతదేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితా విడుదలైంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం . క్రోల్ రిపోర్ట్ ప్రకారం, బ్రాండ్ వాల్యూ పరంగా బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టార్లను కింగ్ కోహ్లీ అధిగమించాడు.

Virat kohli: ఎవ్వరికి అందదు అతని రేంజ్.. బ్రాండ్ వ్యాల్యూలో  కోహ్లీకి టాప్ ప్లేస్.. టాప్-5లో ఎవరున్నారంటే?
Virat Kohli

Updated on: Jun 19, 2024 | 1:13 PM

భారతదేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితా విడుదలైంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం . క్రోల్ రిపోర్ట్ ప్రకారం, బ్రాండ్ వాల్యూ పరంగా బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టార్లను కింగ్ కోహ్లీ అధిగమించాడు. గతేడాది విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ ఒక్కసారిగా పడిపోయింది. కానీ తాజాగా విడుదలైన ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్’ రిపోర్ట్‌లో విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువను, పాపులారిటీని తిరిగి పొందగలిగాడు. బాలీవుడ్ స్టార్లు, అథ్లెట్లతో సహా భారతదేశపు టాప్ 25 ప్రముఖులు, వారి సామూహిక బ్రాండ్ విలువ 2023లో సుమారు $1.9 బిలియన్లకు పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 15.5% పెరుగుదలను సూచిస్తుంది. కాగా, విరాట్ కోహ్లీ 28.9% వృద్ధితో అగ్రస్థానంలో నిలిచాడు. విరాట్‌ కోహ్లి బ్రాండ్‌ విలువ గత కొన్నేళ్లుగా పడిపోతోంది. కానీ తాజాగా ‘సెలబ్రిటీ బ్రాండ్ అసెస్ మెంట్ ‘లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ పెరుగుతున్నట్లు తేలింది.

2022లో విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ 176.9 మిలియన్ డాలర్లు కాగా, 2023 నాటికి 227.9 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇది గణనీయమైన 28.9% పెరుగుదల అని బ్రాండ్ విలువ కన్సల్టెన్సీ క్రోల్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

కింగ్ ఖాన్‌ను అధిగమించిన కింగ్ కోహ్లీ:

షారూఖ్ ఖాన్ బ్రాండ్ విలువ 2020లో USD 51.1 మిలియన్ల నుండి 2023లో USD 120.7 మిలియన్లకు 116.6% పెరిగింది, అయినప్పటికీ, అతని బ్రాండ్ విలువ విరాట్ కోహ్లీ కంటే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ కింగ్ ఖాన్ బ్రాండ్ విలువ 120.7 మిలియన్ డాలర్లు కాగా, కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ 227.9 మిలియన్ డాలర్లకు చేరుకుంది. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కు 203.1 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూ ఉంది.

భారత అత్యంత విలువైన సెలబ్రిటీ అయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 మ్యాచ్‌లకు కింగ్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. జూన్ 20న జరిగే రెండో రౌండ్‌లో భారత్ తొలి మ్యాచ్‌ను ఆడనుంది, అక్కడ ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us