Virat Kohli Century: విరాట్ కోహ్లి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో వరుసగా రెండో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టులో 3వ రోజు మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీ కోహ్లికి టెస్టు క్రికెట్‌లో 30వది కావడం గమనార్హం.
ఈ నాక్‌తో, కోహ్లి సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి, ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఆస్ట్రేలియాలో 10 సెంచరీలు చేశాడు. సచిన్ ఆసీస్‌లో 7 సెంచరీలు చేశాడు.
గతేడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన తర్వాత కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ. ఐదేళ్ల తర్వాత స్వదేశానికి దూరంగా కోహ్లీకి అదే తొలి టెస్టు సెంచరీ.
Hello Australia 🇦🇺
KING KOHLI has brought up his 7th Test century on Aussie soil and second at the Perth Stadium. A classic knock from the champion batter 🫡🫡
Live – https://t.co/gTqS3UPruo… #AUSvIND | @imVkohli pic.twitter.com/QHMm7vrhcw
— BCCI (@BCCI) November 24, 2024
కోహ్లి సెంచరీ చేసిన వెంటనే భారత్ 6 వికెట్లకు 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ఆస్ట్రేలియాకు 534 లక్ష్యాన్ని నిర్దేశించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..