T20 ప్రపంచ కప్ 2022లో భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) మ్యాచ్ బుధవారం రాత్రి చాలా ఉత్కంఠగా ముగిసింది. చివరి బంతికి మ్యాచ్ ఫలితం వెలువడింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కొన్ని వివాదాలకు కూడా దారి తీసింది. విరాట్ కోహ్లీకి అంపైర్ ‘నో-బాల్’ ఇవ్వడం, మైదానం తడిసినా మ్యాచ్‌ని పూర్తి చేయడం వంటి వివాదాస్పద నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. ఇందులో విరాట్ కోహ్లి ‘ఫేక్ ఫీల్డింగ్’కు సంబంధించి మరో వివాదం కూడా తెరపైకి వచ్చింది.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ‘ఫేక్ ఫీల్డింగ్’ చేశాడని బంగ్లాదేశ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నూరుల్ హసన్ ఆరోపించారు. దీనిపై అంపైర్ చర్యలు తీసుకుని టీమిండియాపై పెనాల్టీ విధించి ఉంటే మ్యాచ్ ఫలితం బంగ్లాదేశ్ కు అనుకూలంగా ఉండేదని కూడా చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం నూరుల్ హసన్ బంగ్లాదేశ్ ఓటమికి కారణాన్ని తెలిపాడు. ఆ సమయంలో, పిచ్ తేమను ఒక ముఖ్యమైన అంశంగా అభివర్ణించాడు. దీనితో పాటు, అతను విరాట్ కోహ్లీ ‘ఫేక్ త్రో’ గురించి కూడా మాట్లాడాడు. అతను మాట్లాడుతూ, ‘మేమంతా నేల తడిగా ఉందని చూశాం. దీనితో పాటు త్రో కూడా జరిగింది. దీనిపై 5 పరుగుల పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఇదే జరిగి ఉంటే, మ్యాచ్ మనకు అనుకూలంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఇది కూడా విస్మరించారని చెప్పుకొచ్చాడు’.
That Throw act from Virat Kohli ?
But Nevertheless Both batsman give clear statement that they were not distracted from this. pic.twitter.com/Gy2dbopaVP
— Riyaan (@imdeepjyotideka) November 3, 2022
అయితే, నూరుల్ హసన్ ఈ ఆరోపణలను తప్పు పట్టలేదు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో అర్ష్‌దీప్ బ్యాటింగ్ ఎండ్ వైపు బంతిని విసిరినప్పుడు, విరాట్ కోహ్లి ఈ అక్రమ చర్యకు పాల్పడ్డాడు. రూల్ 41.5.1 ప్రకారం, ఫీల్డింగ్ జట్టు ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మెన్ ఏకాగ్రతకు భంగం కలిగించేలా ఏదైనా చర్యకు పాల్పడితే, అంపైర్ ఆ బంతికి డెడ్ బాల్ ఇచ్చి బ్యాటింగ్ చేసే జట్టుకు అదనంగా 5 పరుగులు ఇవ్వవచ్చు. అయితే, కోహ్లీ చేసినది ఫేక్ ఫీల్డింగ్ కిందకి వస్తుందా.. లేదా బంగ్లా కీపర్ నోరు జారాడా అనేది తెలియాల్సి ఉంది. ఐసీసీ ఈ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.
అయితే ఇన్ని వివాదాల నడుమ చివరికి ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో సెమీ ఫైనల్ రేసులో టీమ్ ఇండియా ముందుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆశలు మరికొన్ని మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి.