ఆ సమస్యతో 9 ఏళ్లు నరకం చూశా.. ఆయన లేకపోతే నేను లేను..: కింగ్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్

Virat Kohli Mental Health: విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలోని మరో పార్శ్వాన్ని ఆవిష్కరించాయి. కేవలం ఫిట్నెస్, టెక్నిక్ మాత్రమే కాకుండా, ఆటగాళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకునే రాహుల్ ద్రవీడ్ వంటి గురువులు ఉన్నప్పుడే గొప్ప ఆటగాళ్లు తమ కెరీర్‌ను సుదీర్ఘకాలం కొనసాగించగలరని ఈ ఘటన నిరూపించింది.

ఆ సమస్యతో 9 ఏళ్లు నరకం చూశా.. ఆయన లేకపోతే నేను లేను..: కింగ్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్
Virat Kohli Comments

Updated on: May 20, 2026 | 4:17 PM

Virat Kohli Mental Health: మైదానంలో దూకుడుకు కేరాఫ్ అడ్రస్.. సెంచరీల రారాజు.. టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. ఎంతటి బౌలర్లనైనా తన బ్యాటింగ్‌తో భయపెట్టే విరాట్, తన మనసులోని అసలు భయాన్ని బయటపెట్టారు. తాను ఎదుర్కొన్న మానసిక ఆందోళనలను వివరిస్తూ, తన కెరీర్‌ను కాపాడిన రాహుల్ ద్రవీడ్ పట్ల కృతజ్ఞత చాటుకున్నారు.

విరాట్ కోహ్లీని వదలని మానసిక ఒత్తిడి: ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ అంటే ఏమిటి?

క్రికెట్ ప్రపంచంలో శిఖరాగ్రాన ఉన్న ఆటగాళ్లు మానసికవ్యాధులకు అతీతం అని మనం అనుకుంటాం. కానీ, విరాట్ కోహ్లీ విషయంలో ఇది తలకిందులైంది. బెంగుళూరులో జరిగిన ఆర్‌సీబీ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లీ తన మనసులోని బాధను పంచుకున్నాడు. తాను సుదీర్ఘకాలం పాటు ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ (Impostor Syndrome) అనే మానసిక స్థితితో పోరాడానని ఆయన వెల్లడించాడు.

ఇది కూడా చదవండి: IPL 2026: ఇదేందిది.. ప్లేఆఫ్స్‌కు చెన్నై టీం.. టాప్ 4 కోసం పెద్ద ప్లాన్ చేశారుగా..!

ఇవి కూడా చదవండి

ఈ సిండ్రోమ్ బారిన పడిన వారు తాము సాధించిన అద్భుత విజయాలను కూడా తమ సొంత కష్టం అని నమ్మలేరు. “నేను దీనికి అర్హుడిని కాను, కేవలం అదృష్టం వల్లే నాకు ఇవన్నీ దక్కాయి, నా అసమర్థత త్వరలోనే అందరికీ తెలిసిపోతుంది” అనే భయంతో లోలోపల కుమిలిపోవడమే ఈ స్థితి. ప్రపంచ స్థాయి బ్యాటర్ అయినప్పటికీ, నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే సమయంలో యువ ఆటగాళ్లు తనను చూసి ఏమనుకుంటున్నారో అనే ఆందోళన కోహ్లీని నిరంతరం వెంటాడేదట.

ఆ తొమ్మిదేళ్లు ఎవరూ పలకరించలేదు..

తన కెరీర్ గురించి మాట్లాడుతూ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. “కెప్టెన్సీ బాధ్యతల్లో నేను ఎంతగా మునిగిపోయానంటే, నా వ్యక్తిగత భావాలను కూడా మర్చిపోయాను. అన్నింటినీ చక్కగా నిర్వహిస్తున్నానని అనుకున్నాను కానీ, ఆ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి ‘విరాట్, నువ్వు ఎలా ఉన్నావు?’ అని ప్రేమగా అడగలేదు” అని కోహ్లీ వాపోయాడు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఆ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచింది మాత్రం రాహుల్ ద్రవీడ్ అని ఆయన కొనియాడాడు.

ఇది కూడా చదవండి: వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే.. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

రక్షణ కవచంలా నిలిచిన రాహుల్ ద్రవిడ్..

విరాట్ కోహ్లీ కెరీర్ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు, టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవీడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతనికి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. “రాహుల్ భాయ్ స్వతహాగా గొప్ప క్రికెటర్ కావడంతో, ఒక ఆటగాడు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని ఆయన త్వరగా అర్థం చేసుకున్నారు. వారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మైదానంలోకి వెళ్లి పరుగుల దాహాన్ని ఎలా తీర్చుకోవాలో నాకు మళ్ళీ గుర్తుచేశారు. నేను క్రికెట్ చరిత్రలో సాధించిన గొప్ప విజయాలను నాకు వివరించి, నాలో మళ్లీ నమ్మకాన్ని నింపారు” అని కోహ్లీ తెలిపాడు.

కృతజ్ఞతతో కింగ్ కోహ్లీ..

ద్రవిడ్ మార్గదర్శకత్వం వల్లే తాను మళ్లీ క్రికెట్‌ను ఆస్వాదించడం మొదలుపెట్టానని కోహ్లీ పేర్కొన్నాడు. “నా కెరీర్‌లోని చీకటి రోజుల్లో రాహుల్ భాయ్ అందించిన సహకారానికి నేను సదా రుణపడి ఉంటాను. ఆయన వల్లే నేను మళ్ళీ బ్యాట్ పట్టుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలిగాను” అంటూ తన కృతజ్ఞతను చాటుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఎవర్రా మీరంతా.. మీరు, మీ ఆట తగలెయ్యా.. ఏరికోరి తెస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన నలుగురు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us