AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తొలి ట్రోఫీ అందిన వేళ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టిన కోహ్లీ.. అనుష్కకు ఎమోషనల్ హగ్

Virat Kohli Video: ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్‌సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీకి, జట్టుకు ఒక్కసారైనా ట్రోఫీ అందించాలనేది చిరకాల స్వప్నం. ఎన్నోసార్లు ప్లేఆఫ్స్‌కు చేరినా, ఫైనల్స్‌లో అడుగుపెట్టినా విజయం మాత్రం ఆర్‌సి‌బికి దూరంగానే ఉండిపోయింది. ఈ క్రమంలో తొలిసారి ట్రోఫీ దక్కడంతో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Video: తొలి ట్రోఫీ అందిన వేళ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టిన కోహ్లీ.. అనుష్కకు ఎమోషనల్ హగ్
Virat Kohli Crying Video
Venkata Chari
|

Updated on: Jun 04, 2025 | 12:16 AM

Share

Virat Kohli Video: ఇది అద్భుత దృశ్యం..! ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ (PBKS)ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మొట్టమొదటిసారిగా టైటిల్‌ను కైవసం చేసుకున్న క్షణం, ఆ జట్టు మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సార్లు అందని ద్రాక్షగా ఊరించిన ట్రోఫీ ఎట్టకేలకు సొంతమవడంతో, కోహ్లీ మైదానంలోనే ఆనందభాష్పాలు రాల్చాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను ద్రవింపజేసింది.

చిరకాల స్వప్నం సాకారం..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్‌సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీకి, జట్టుకు ఒక్కసారైనా ట్రోఫీ అందించాలనేది చిరకాల స్వప్నం. ఎన్నోసార్లు ప్లేఆఫ్స్‌కు చేరినా, ఫైనల్స్‌లో అడుగుపెట్టినా విజయం మాత్రం ఆర్‌సి‌బికి దూరంగానే ఉండిపోయింది. ఎన్నో విమర్శలు, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కోహ్లీ, ఈ విజయం కోసం తపించాడు. 2025 సీజన్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఉత్కంఠభరిత పోరులో ఆర్‌సి‌బి విజయం సాధించగానే, మైదానంలోని సహచరులతో కలిసి సంబరాలు చేసుకుంటూనే కోహ్లీ కళ్లు చెమర్చాయి.

ఆనందభాష్పాలు ఆగలేదు..

జట్టు సభ్యులు ఒకరినొకరు అభినందించుకుంటుండగా, విరాట్ కోహ్లీ మోకాళ్లపై కూర్చొని, ముఖం చేతులతో కప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ కన్నీళ్లలో సంవత్సరాల పోరాటం, జట్టు పట్ల అతనికున్న అంకితభావం, అభిమానుల ఆశలను నెరవేర్చానన్న సంతృప్తి అన్నీ కలగలిసి కనిపించాయి. సహచరులు, సహాయక సిబ్బంది వచ్చి అతడిని ఓదార్చినా, ఆ భావోద్వేగ ప్రవాహాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఆర్‌సి‌బి జెండాను పట్టుకుని మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తున్నప్పుడు కూడా అతని కళ్లలో ఆనందభాష్పాలు మెరుస్తూనే ఉన్నాయి.

 భార్యకు ఎమోషనల్ హగ్..

వైరల్ అయిన వీడియో – అభిమానుల స్పందన:

విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “కింగ్ కన్నీళ్లు ఇవి, ఆనందభాష్పాలు ఇవి”, “ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది”, “ఈ క్షణం కోసమే కదా ఎదురుచూసింది” అంటూ అభిమానులు తమ సంతోషాన్ని, కోహ్లీ పట్ల తమకున్న అభిమానాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తపరిచారు. కఠినంగా, దూకుడుగా కనిపించే కోహ్లీలోని సున్నితమైన కోణాన్ని ఈ వీడియో ఆవిష్కరించిందని పలువురు వ్యాఖ్యానించారు.

ఈ విజయం విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఒక మధురమైన ఘట్టం. ఒక ఆటగాడిగా, ఒక నాయకుడిగా అతను పడిన శ్రమకు దక్కిన నిజమైన ప్రతిఫలం ఇది. ఆర్‌సి‌బి అభిమానులకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చారిత్రాత్మక విజయం. కోహ్లీ కన్నీళ్లు కేవలం ఆనందానికి మాత్రమే కాదు, పట్టుదలకు, నిరంతర కృషికి నిదర్శనంగా నిలిచిపోయాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..