Virat Kohli Dance Video: జిమ్‌లోదుమ్మురేపిన కోహ్లీ-అనుష్క డ్యాన్స్.. వీడియో చివరి వరకు చూసిన అభిమానుల్లో హై టెన్షన్..

విరాట్ కోహ్లీ, అనుష్క జిమ్‌లో పంజాబీ పాటలపై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ షేర్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూడండి..

Virat Kohli Dance Video: జిమ్‌లోదుమ్మురేపిన కోహ్లీ-అనుష్క డ్యాన్స్.. వీడియో చివరి వరకు చూసిన అభిమానుల్లో హై టెన్షన్..
Kohli Anushka Dancing
Follow us

|

Updated on: Apr 24, 2023 | 3:47 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తరచు నెట్టింట్లోనే ఉంటాడు. కొన్నిసార్లు అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తే మరికొన్నిసార్లు మైదానంలో ఉద్వేగభరితమైన వైఖరితో చర్చనీయాంశంగా మారుతాడు. ఈసారి విరాట్ తన లైఫ్ పార్టనర్‌ అనుష్కతో కలిసి చేసిన డ్యాన్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ ఇటీవల జిమ్ సెషన్‌లో అనుష్క శర్మతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోను అనుష్క తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె జిమ్‌లో కోహ్లీతో కలిసి డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. బ్యాక్ గ్రౌండ్‌లో పంజాబీ పాట ప్లే అవుతోంది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఒక్కసారిగా ఆగి కుంటుతూ నడవడం అందరిని నవ్వు తెప్పించింది. అదే సమయంలో కోహ్లీ అభిమానులు మాత్రం ఆందోళనకు గురయ్యారు.

అయితే, ఈ డ్యాన్స్ చూస్తుంటే కాలు బెణికినట్లుగా అనిపిస్తుంది. బహుశా ఇది కోహ్లీ ఫన్నీ కోసం ఇలా చేసి ఉంటాడని రీట్వీట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోపై చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఈ వార్త రాసే వరకు అనుష్క ప్రొఫైల్‌లో షేర్ చేసిన వీడియోను 1.6 మిలియన్ల మందికి పైగా లైక్ చేశారు.

విశేషమేంటంటే, ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లి ప్రదర్శన ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. 7 మ్యాచ్‌లు ఆడి 279 పరుగులు చేశాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో ఫాఫ్ డు ప్లెసిస్ నంబర్ వన్. 7 మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేశాడు. కోహ్లి-డుప్లెసిస్‌ల జట్టు కూడా రాణిస్తోంది. ప్రస్తుతం అతను ఐదో స్థానంలో ఉన్నాడు. RCB 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది. కాగా 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం

Latest Articles