Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరుగులు చేసినా.. చేయకున్నా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గట్లేదు. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అతనికి బోలెడు మంది వీరాభిమానులున్నారు. దుబాయిలో జరుగుతున్న ఆసియా కప్ వేదికగా ఈ విషయం మరోసారి రుజువైంది. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో మాట్లాడేందుకు, అతడు సంతకం చేసిన జెర్సీని పొందేందుకు దాయాది దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు ఆసక్తిచూపిన విషయం తెలిసిందే. ఇక అభిమానులైతే కోహ్లీని కలిసి అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకుని మురిసిపోయారు. కోహ్లీ సైతం వారితో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగి అందరి మనసులు గెల్చుకున్నాడు. తనను ఇంతవాడిని చేసిన అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ రన్‌మెసిన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
అందుకే అతను కింగ్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, హాంకాంగ్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టు స్టేడియంలోకి వెళుతుండగా.. కోహ్లీ వీరాభిమాని అయిన ఓ బాలుడు సెక్యూరిటీ కళ్ల గప్పి విరాట్ దగ్గరకు దూసుకొచ్చాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. దీన్ని గమనించిన కోహ్లీ.. ఆ బాలుడిని వదిలేయాల్సిందిగా సూచించాడు. దీంతో సెక్యూరిటీ గార్డు ఆ బాలుడిని విడిచిపెట్టాడు. దీంతో కోహ్లీ వద్దకు పరుగున వెళ్లిన ఆ బాలుడు.. విరాట్ ఆటోగ్రాఫ్ తీసుకొని, సెల్ఫీలు దిగి తెగ సంబరపడిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ బాలుడి పట్ల కోహ్లీ ఎంతో హుందాగా ప్రవర్తించాడని ఫ్యాన్స్, నెటిజన్లు మన రన్‌మెషిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Watch how Virat Kohli made the day of a young li’l fan?@imVkohli #ViratKohli? pic.twitter.com/hnsnhEAAGw
— iᴍ_Aʀʏᴀɴ18 (@crickohli18) August 30, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..