Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే లేదు. రోజుకు బోలెడన్ని వీడియోలు నెట్టింట్లో అప్‌లోడ్ అవుతూ నెటిజన్లను అలరిస్తున్నాయి. తాజాగా ఛారిటీ మ్యాచ్ అంటూ బరిలోకి దిగిన క్రికెటర్లు.. బ్యాట్‌లతో తన్నుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య వివాదాలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే, అంపైర్లు, తోటి ఆటగాళ్లు ఎంటరై గొడవలను సద్దుమణిగిస్తుంటారు. కానీ, ఈ గొడవలో మాత్రం అలా జరగలేదు. వివాదం ఫీక్స్‌కి చేరడంతో బ్యాట్‌లతో బాదేసుకున్నారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఛారిటి మ్యాచులో జరిగింది ఈ తంతు. షెహజాద్ అక్రమ్ ఆధ్వర్యంలో పాక్‌లోని పేదలకు వైద్యం చేసేందుకు ఇంగ్లండ్‌లో ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్ చివరికి రక్తపాతంతో ముగియడంతో.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.
అయితే, అసలు గొడవకి కారణమైతే తెలియలేదు. మొదట బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. దాంతో వివాదం చినికి చినికి గాలివానలా తయారైంది. రెండు టీలం ఆటగాళ్లు ఆవేశం ఆపుకోలేక బ్యాట్‌లతో దాడి చేసుకోవడం వీడియోలో చూడోచ్చు. గొడమ మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు ఎంటరై, సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆటగాళ్లు ఆగలేదు. ఇందులో ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయారంట.
ఈ మేరకు షెహజాద్ అక్రమ్ స్పందిచాడు. ‘రెండు ఓవర్లు అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిపోయేది. ఇంతలో కొందరు గ్రౌండ్‌లోకి ఎంటరై వివాదాన్ని షురూ చేశారు. కారణం మాత్రం తెలియదు. బ్యాట్‌లతో ఆటగాళ్లని తీవ్రంగా కొట్టారు. ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని చెడగొట్టారు’ అని ఆయన వాపోయాడు.
Disgraceful scenes during a charity match which had to be abandoned after a fight between the two teams. The violence erupted at the end of a game at Mote Park Cricket Club in Maidstone during a tournament raising money for those in need of medical treatment in Pakistan pic.twitter.com/uGOYPuc3z2
— Saj Sadiq (@Saj_PakPassion) July 20, 2021
Also Read:
ICC Rankings: 16 ఏళ్లలో తొమ్మిదోసారి.. మిథాలీ రాజ్ ‘టాప్’ గేర్!
Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్ కప్‌లో డౌటే?