AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..! దిష్టి తగిలిందంటూ..

ఇండియా ‘ఎ’ తరఫున తొలి మ్యాచ్ ఆడిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. శ్రీలంక ‘ఎ’తో ట్రై-సిరీస్ తొలి మ్యాచ్‌లో 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మూడు బౌండరీలతో తన దూకుడు శైలిని చూపించిన వైభవ్ అభిమానులను ఆకట్టుకున్నాడు.

Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..! దిష్టి తగిలిందంటూ..
Vaibhav Suryavanshi
SN Pasha
|

Updated on: Jun 09, 2026 | 12:53 PM

Share

యువ సంచలనం వైభవ్ సూర్యవన్షీ టీమిండియాకు ఎంపిక అయిన తర్వాత తొలి సారి గ్రౌండ్‌లోకి దిగాడు. కానీ తన అభిమానులను పూర్తిగా నిరాశపర్చాడు. ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న ట్రై-సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవన్షీకి ఓపెనర్‌గా ఆడే అవకాశం లభించింది. ఇండియా ‘ఎ’ జెర్సీని తొలిసారిగా ధరించిన ఈ యువ ఓపెనర్‌పై మ్యాచ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఐపీఎల్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఈ మ్యాచ్‌లో కూడా అదే తరహా ప్రదర్శన ఇస్తాడని అందరూ భావించారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ‘ఎ’ కెప్టెన్ తిలక్ వర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో వైభవ్ సూర్యవన్షీ ఓపెనర్‌గా క్రీజులోకి దిగాడు. తొలి బంతి నుంచే తన సహజ శైలిలో షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. కేవలం 12 బంతులు ఎదుర్కొన్న వైభవ్ మూడు అద్భుతమైన బౌండరీల సాయంతో 14 పరుగులు సాధించాడు. అయితే మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చుకునే అవకాశాన్ని అతడు చేజార్చుకున్నాడు. శ్రీలంక ‘ఎ’ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షిరాజ్ వేసిన ఫుల్-లెంగ్త్ బంతిని మిడ్-ఆఫ్ మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించిన వైభవ్ టైమింగ్‌ను సరిగ్గా అందుకోలేకపోయాడు. దీంతో బంతి గాల్లోకి లేచింది. మిడ్ ఆఫ్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ‘ఎ’ కెప్టెన్ సహన్ అరచ్చిగే తన ఎడమవైపు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది.

వైభవ్ క్రీజులో ఎక్కువసేపు నిలిస్తే మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రత్యర్థి శిబిరంలో సంబరాలు కనిపించాయి. మరోవైపు భారత అభిమానులు మాత్రం యువ ఆటగాడి నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించినప్పటికీ నిరాశ చెందారు. అయితే వైభవ్ ప్రతిభపై ఎలాంటి సందేహాలు లేవని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన అతడు 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. దాదాపు 237 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల వర్షం కురిపించిన ఈ యువ బ్యాటర్ భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదుగుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అతడి దృష్టి ట్రై-సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లపై ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?