అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ.. ఇద్దరిలో డేంజరస్ ప్లేయర్ ఎవరు..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..!

Vaibhav Sooryavanshi, Abhishek Sharma: ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు తమ మెరుపు వేగంతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ కూడా అత్యంత వేగవంతమైన అర్ధశతకాలతో సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో బౌలర్లను వణికించే అసలైన విధ్వంసకర వీరుడు ఎవరనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ.. ఇద్దరిలో డేంజరస్ ప్లేయర్ ఎవరు..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..!
Vaibhav Sooryavanshi, Abhishek Sharma

Updated on: Apr 19, 2026 | 7:58 PM

Vaibhav Sooryavanshi, Abhishek Sharma: ప్రస్తుత సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేసిన రికార్డు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరి పేరిట ఉంది. వీరు కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ ఘనతను ఈ ఒక్క సీజన్‌లోనే రెండుసార్లు సాధించడం విశేషం. గణంకాలను పరిశీలిస్తే వైభవ్ సూర్యవంశీ 5 మ్యాచ్‌లలో 200 పరుగులు సాధించారు. ఆయన స్ట్రైక్ రేట్ 263.15గా ఉండటం విశేషం, ఇది ఈ సీజన్‌లో ఏ బ్యాటర్‌కైనా అత్యుత్తమం. మరోవైపు అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్‌ల్లో 188 పరుగులు చేశాడు.

వైభవ్ ఎందుకు ప్రమాదకరం? కోచ్ వివరణ..

వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా ప్రకారం, అభిషేక్ శర్మతో పోలిస్తే వైభవ్ ఐదు కారణాల వల్ల బౌలర్లకు ఎక్కువ ప్రమాదకరంగా కనిపిస్తుంటాడని తెలిపాడు.

అత్యంత దూకుడు: అభిషేక్ కంటే వైభవ్ సహజంగానే ఎక్కువ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. మొదటి బంతి నుంచే బౌలర్‌పై ఒత్తిడి పెంచడం ఆయన శైలి.

షాట్ల వైవిధ్యం: వైభవ్ వద్ద అభిషేక్ కంటే ఎక్కువ రకాల షాట్లు అందుబాటులో ఉన్నాయి. మైదానం నలుమూలలా బంతిని పంపగల సామర్థ్యం ఆయనకు ఉంది.

వేగవంతమైన పరుగులు: స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే వైభవ్ పరుగులు తీసే వేగం బౌలర్ల లయను దెబ్బతీస్తుంది.

మానసిక ఆధిపత్యం: బౌలర్ ఎవరు అన్నది పట్టించుకోకుండా వారిపై మానసిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో వైభవ్ ముందుంటాడు.

పరిమితులు లేని బ్యాటింగ్: అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలి ఒక పరిధికి లోబడి ఉంటుందని, కానీ వైభవ్ విషయంలో బౌలర్లు ఎక్కడ బంతి వేయాలో అర్థం కాక ఇబ్బంది పడతారని కోచ్ అభిప్రాయపడ్డారు.

సిక్సర్ల సునామీ..

ఈ సీజన్‌లో సిక్సర్ల పరంగా కూడా వైభవ్ దూసుకుపోతున్నారు. కేవలం 5 మ్యాచ్‌లలోనే ఆయన 18 భారీ సిక్సర్లు బాదారు. సిక్సర్ల జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. అభిషేక్ శర్మ 17 సిక్సర్లతో ఆయన వెంటే ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us