INDW vs PAKW: భారత్-పాక్ మ్యాచ్‌లో బిగ్ మిస్టేక్.. కౌంట్ చేయడం మర్చిపోయిన అంపైర్స్.. ఒక్క ఓవర్‌లో ఎన్ని బంతులు వేయించారంటే?

T20 World Cup: మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భారత్ తమ మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో అంపైర్ నుంచి పెద్ద తప్పిదం తెరపైకి వచ్చింది.

INDW vs PAKW: భారత్-పాక్ మ్యాచ్‌లో బిగ్ మిస్టేక్.. కౌంట్ చేయడం మర్చిపోయిన అంపైర్స్.. ఒక్క ఓవర్‌లో ఎన్ని బంతులు వేయించారంటే?
India W Vs Pakistan W
Follow us

|

Updated on: Feb 13, 2023 | 12:30 PM

మహిళల టీ20 ప్రపంచ కప్ (Women’s T20 WC) ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 13) భారత్ వర్సెస్ పాకిస్తాన్ (INDW vs PAKW) జట్ల మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. ఇందులో 19వ ఓవర్ చివరి బంతికి భారత జట్టు విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో అంపైర్ల నుంచి పెద్ద తప్పిదం జరిగింది. భారత జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు, 7వ ఓవర్‌లో, పాక్ బౌలర్‌ను 6కి బదులుగా 7 బంతులు వేసేలా చేశారు. ఇక్కడ 7వ బంతికి ఫోర్ వచ్చింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పాక్ క్రికెట్ అభిమానులు ఈ తప్పును పాక్ ఓటమికి ఒక కారణమని కామెంట్లు చేస్తున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం పవర్ ప్లేలో నెమ్మదిగా ప్రారంభించిన భారత జట్టు మొదటి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ నిదా దార్ ఏడో ఓవర్ వేయడానికి వచ్చింది. 6 బంతుల్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. అయితే, పొరపాటున ఏడో బంతి వేయాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని బౌలర్ కూడా పట్టించుకోలేదు. నిదా దార్ ఈ అదనపు బంతిపై, భారత బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఫోర్ కొట్టడం ద్వారా తన జట్టుపై కొంత ఒత్తిడిని తగ్గించింది. అంపైర్‌తో పాటు, బౌలర్ కూడా తప్పు చేశాడు. ఆమె తన బంతులను గుర్తుంచుకుంటే అంపైర్ తప్పును సరిదిద్దే ఛాన్స్ ఉండేది.

ఇవి కూడా చదవండి

ఈ ఎక్స్‌ట్రా బాల్‌ అప్పట్లో అంత భారంగా అనిపించలేదు కానీ.. ఈ మ్యాచ్‌లో భారత్‌ అతి చేరువగా గెలుపొందినప్పుడే అభిమానులకు ఈ బంతి విలువ తెలిసిపోయింది. భారత జట్టు విజయానికి నాలుగు ఓవర్లలో 41 పరుగులు అవసరం. మ్యాచ్ ఫలితం దోబూచులాడుతోంది. అయితే అదనంగా నాలుగు పరుగులు చేయకుంటే.. భారత జట్టుపై రన్ రేట్ ఒత్తిడి మరింత పెరిగి ఉండేది. ఈ తప్పిదంతో పాక్ అభిమానులు మైదానంలో ఉన్న అంపైర్లను టార్గెట్ చేశారు.

ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం..

చివరి ఓవర్‌లో జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌ల బలమైన బ్యాటింగ్‌తో భారత జట్టు విజయం సాధించింది. 17, 18, 19 ఓవర్లలో వీరిద్దరూ వరుసగా ఫోర్లు బాదడంతో భారత జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 38 బంతుల్లో 53 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్జ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..