AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL Auction 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అందరి చూపు ఆమెవైపే.. ఆ స్పెషల్ లేడీ ఎవరో తెలుసా?

Malika Advani: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ కోసం ముంబైకి చెందిన మహిళా వేలం నిర్వాహకురాలిగా మాలికా అద్వానీని బీసీసీఐ ఎంపిక చేసింది.

WPL Auction 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అందరి చూపు ఆమెవైపే.. ఆ స్పెషల్ లేడీ ఎవరో తెలుసా?
Wpl 2023 Auction
Venkata Chari
|

Updated on: Feb 13, 2023 | 2:16 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత, క్రికెట్ అభిమానులందరూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఎట్టకేలకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. తొలి ఎడిషన్ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆటగాళ్ల వేలం ప్రక్రియను ముంబైలో ఫిబ్రవరి 13న జరగనుంది. ఇందుకోసం వేలం నిర్వహణకు మహిళా వేలం నిర్వాహకురాలిగా(ఆక్షనీర్) మలికా అద్వానీని బోర్డు ఎంపిక చేసింది.

ఇంతకుముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరిగినప్పుడల్లా అందులో పురుష వేలం నిర్వాహకులు మాత్రమే ఉండేవారు. వారిలో రిచర్డ్ మాడ్లీ, హ్యూ ఆడమ్స్ కాకుండా చారు శర్మ ఈ బాధ్యతను నిర్వర్తించారు. మహిళల ప్రీమియర్ లీగ్‌కు మహిళా వేలంపాటను ఎన్నుకోవడంతో పాటు బీసీసీఐ అందరికీ కీలక సందేశాన్ని ఇచ్చింది.

మల్లికా అద్వానీ ఎవరో తెలుసా?

Malika Advani Wpl

ఇవి కూడా చదవండి

మల్లికా అద్వానీ గురించి మాట్లాడితే, ఆమె ముంబై నివాసి. ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌తో కలిసి ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామిగా కూడా పనిచేస్తున్నారు. 2021లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా మల్లికా అద్వానీ వేలంపాట నిర్వహించింది. బీసీసీఐ నిర్వహించిన వేలంపాటను ఒక మహిళ నిర్వహించడం ఇదే తొలిసారి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల వేలం గురించి మాట్లాడితే, ఇది ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది.

తొలి సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు..

మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ కోసం, వేలం ప్రక్రియలో చేరడానికి 1000 కంటే ఎక్కువ మంది క్రీడాకారులు తమ పేర్లను అందించారు. ఆ తర్వాత మొత్తం 409 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఇందులో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్టులో గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను చేర్చుకునే అవకాశం ఉంటుంది. మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో మార్చి 4 నుంచి మార్చి 26 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!