AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023 Auction Highlights: డబ్య్లూపీఎల్ వేలం హిట్.. భారత మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం..

WPL Auction 2023 Live Updates in Telugu: మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ముంబైలో జరుగుతుంది. మొత్తం 409 మంది ఆటగాళ్లను నేడు వేలం వేస్తున్నారు

WPL 2023 Auction Highlights: డబ్య్లూపీఎల్ వేలం హిట్.. భారత మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం..
Wpl 2023 Auction Live
Venkata Chari
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Feb 13, 2023 | 8:07 PM

Share

తొలిసారి నిర్వహిస్తున్న బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ వేలం నేడు ముంబైలో జరుగుతోంది. వేలంలో మొత్తం 409 మంది ఆటగాళ్ల భవితవ్యాన్ని 5 జట్లు నిర్ణయించనున్నాయి. వేలం కోసం 1525 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే చివరికి 409 మంది ఆటగాళ్ల పేర్లు మాత్రమే తుది జాబితాకు చేరుకున్నాయి. వేలంలో మొత్తం 90 స్థలాలకు బిడ్డింగ్ జరగనుంది. మొత్తం ఐదు జట్లకు వేలంలో తమ పర్స్‌లోని రూ.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతి జట్టు కనీసం 15, గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. వీరిలో 7గురు ఆటగాళ్లు విదేశీయులు కావచ్చు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ వంటి పేర్లతో సహా 24 మంది ఆటగాళ్లు అత్యధికంగా రూ. 50 లక్షలతో వేలంలోకి ప్రవేశించనున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2023 07:29 PM (IST)

    ముంబై జట్టులోకి సైకా ఇషక్..

    ఇండియన్ యంగ్ ప్లేయర్ సైకా ఇషక్ కోసం ముంబై మాత్రమే ఆసక్తి కనబర్చడంతో.. ఆమె ధర రూ.10 లక్షలే పలికింది.

  • 13 Feb 2023 07:27 PM (IST)

    బెంగళూరు జట్టులోకి చేరిన కనిక అహూజా ..

    పంజాబీ యంగ్ క్రికెటర్ కనిక అహూజా కోసం రూ.15 లక్షలతో వేలం ప్రారంభించిన ముంబై.. బెంగళూరు ముందు వెనకడుగు వేసింది. ఫలితంగా రూ.35 లక్షలతో కనికను ఆర్సీబీ జట్టు తమ సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 07:24 PM (IST)

    బెంగళూరుతో పోటీ పడి మరి మిన్ను మణిని సొంతం చేసుకున్న ఢిల్లీ..

    యంగ్  క్రికెటర్ మిన్ను మణి బేస్ ప్రైస్ రూ.10 లక్షలు. ఇక ఆమె కోసం వేలం ప్రారంభించిన కాపిటల్స్ టీమ్‌తో బెంగళూర్ ఫ్రాంచైజీ పోరాడినప్పటికీ.. ఢిల్లీ జట్టు పైచేయి సాధించింది. అందుకోసం ఆ జట్టు రూ.30 లక్షలు వెచ్చించింది.

  • 13 Feb 2023 07:21 PM (IST)

    వారియర్స్ టీమ్‌లోకి 15వ ప్లేయర్‌గా లక్ష్మీ యాదవ్..

    ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యంగ్ క్రికెటర్ లక్ష్మి యాదవ్ కోసం రూ.10 లక్షలు వెచ్చించిన యూపీ వారియర్స్.. ఆమెను తమ సొంతం చేసుకున్నాయి. దీంతో ఆ టీమ్ ఇప్పటివరకు 15 మంది క్రికెటర్స్‌ను తనవైపుకు చేర్చుకున్నట్లయింది.

  • 13 Feb 2023 07:18 PM (IST)

    కాపిటల్స్ టీమ్‌లోకి లారా హారీస్..

    వేలంలో నిలబడిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ లారా హారీస్ కోసం బెంగళూరు, ఢిల్లీ జట్లు పోటిపడ్డాయి. కానీ చివరికి అమె బేస్ ప్రైస్ రూ. 10 లక్షల కంటే ఎక్కువ వెచ్చించి మరీ రూ.45 లక్షలతో ఢిల్లీ జట్టు తమ సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 07:15 PM (IST)

    జెయింట్స్ జట్టులోకి కర్ణాటక లెఫ్టర్మర్..

    కర్ణాటక లెఫ్టార్మ్ బౌలర్ మోనికా పటేల్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలు. కాగా, ఆమెను అదే ధరకు జెయింట్స్ తమ సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 07:14 PM (IST)

    లారెన్ బెల్‌ను ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న వారియర్స్..

    ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్ కోసం వారియర్స్ మాత్రమే ముందుకు రావడంతో.. ఆమె ధర రూ.30 లక్షలే పలికింది.

  • 13 Feb 2023 07:12 PM (IST)

    గుజరాత్ జెయింట్స్‌లోకి చెన్నై ప్లేయర్..

    2021-22 సంవత్సరాలలో రైల్వేస్ తరఫున ఆడిన చెన్నై ప్లేయర్ డీ. హేమలతను గుజరాత్ జెయింట్స్ తమ సొంతం చేసుకుంది. ఆమె కోసం జెయింట్స్ జట్టు రూ.30 లక్షలు వెచ్చించింది.

  • 13 Feb 2023 07:08 PM (IST)

    కాపిటల్స్ జట్టుకు చేరిన ఇంగ్లాండ్ ప్లేయర్ ఏలిస్..

    ఇంగ్లాండ్ వుమెన్ క్రికెటర్ ఏలిస్ కాప్సే బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు కాగా అమె కోసం ఢిల్లీ కాపిటల్స్ రూ. 75 లక్షలను వెచ్చించింది. అయితే ఏలిస్ కోసం వేలాన్ని ప్రారంభించిన ముంబై.. కాపిటల్స్ ముందు నిలవలేక వెనుదిరిగింది. ఫలితంగా ఏలిస్ కాపిటల్స్ క్వార్టర్స్‌లోకి చేరింది.

  • 13 Feb 2023 07:00 PM (IST)

    ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హారీస్‌ కోసం కాపిటల్స్, చాలెంజర్స్‌తో పోటీపడి గెలిచన వారియర్స్..

    ఆస్ట్రేలియా జట్టుకు చెందిన మరో ఆల్‌రౌండర్ గ్రేస్ హారీస్‌ బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు కాగా యూపీ వారియర్స్ జట్టు అమె కోసం అంతకు రెట్టింపుగా రూ.75 లక్షలను వెచ్చించింది. అయితే అంతకముందు హారీస్ కోసం వారియర్స్ జట్టు.. వేలంలో ఢిల్లీ కాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడవలసి వచ్చింది.

  • 13 Feb 2023 06:55 PM (IST)

    బెంగళూరు జట్టు సొంతమైన ఆసీస్ ఆల్‌రౌండర్ ఎరిన్..

    ఆస్టేలియా ఆల్‌రౌండర్ ఎరిన్ బర్న్స్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన సొంతం చేసుకుంది. ఇందుకోసం ఆర్‌సీబీ రూ.30 లక్షల రూపాయలను వెచ్చించింది.
  • 13 Feb 2023 05:55 PM (IST)

    వేలంలో ఆండర్19 ఆల్ రౌండర్ హార్లీ గాలాకు మొండిచేయి..

    టీమిండియా ఆండర్19 ఆల్ రౌండర్ హార్లీ గాలా బేస్ ప్రైస్ రూ.10 లక్షలు. అయినా అమెను ఎవరూ కొనుగోలు చేయలేదు.

  • 13 Feb 2023 05:51 PM (IST)

    వారియర్స్ జట్టులోకి చేరిన తెలుగు ప్లేయర్..

    తెలుగు ప్లేయర్ ఎస్ యశశ్రీని యూపీ వారియర్స్ రూ.10 లక్షలకు తమ సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 05:46 PM (IST)

    అండర్19 టీ20 ప్రపంచకప్ టాప్ స్కోరర్‌ను సొంతం చేసుకున్న వారియర్స్..

    ఇటీవల జరగిన అండర్19 ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన శ్వేతా సెహ్రావత్ బేస్ ధర రూ. 10 లక్షలు. ఇక ఈ ప్లేయర్ కోసం యూపీ వారియర్స్‌తో పోటి పడిన ఢిల్లీ కాపిటల్స్ వెనకడుగు వేయడంతో.. రూ.40 లక్షలతో యూపీ సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 05:40 PM (IST)

    యార్కర్స్ క్వీన్‌ టైటస్ సధును సొంతం చేసుకున్న ఢిల్లీ కాపిటల్స్..

    రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలో నిలబడిన టైటస్ సధు కోసం యూపీ వారియర్జ్, ఢిల్లీ కాపిటల్స్  పోటీ పడ్డాయి. అండర్-19 స్పీడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న సధును చివరికి రూ. 20 లక్షలతో కాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది.

  • 13 Feb 2023 05:09 PM (IST)

    ఫ్రాంచైజీలు అత్యధికంగా ఖర్చు చేసిన ఆటగాళ్లు వీరే..

    Wpl 2023 Highest Bid Players

  • 13 Feb 2023 05:01 PM (IST)

    26 మంది ఆటగాళ్లలో అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరంటే?

    ఇప్పటి వరకు జరిగిన WPL వేలంలో 26 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మొత్తంగా అన్ని జట్లు కలిపి ఇప్పటి వరకు రూ.39.65 కోట్లు వెచ్చించాయి. ఇందులో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా మంధాన లినిచింది. మంధానను రూ.3.40 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. మొత్తం 26 మంది ఆటగాళ్లలో 14 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

  • 13 Feb 2023 04:57 PM (IST)

    ఇప్పటి వరకు వేలంలో బిడ్లు దక్కించుకున్న ఆటగాళ్లు వీరే..

    1. స్మృతి మంధాన (భారతదేశం) – రూ. 3.4 కోట్లు – RCB

    2. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారతదేశం) – రూ. 1.8 కోట్లు – MI

    3. సోఫీ డివైన్ (NZ) – రూ. 50 లక్షలు – RCB

    4. ఆష్లీ గార్డనర్ (AUS) – రూ. 3.2 Cr – GG

    5. ఎలిస్ పెర్రీ (Aus) – రూ. 1.7 Cr – RCB

    6. సోఫీ ఎక్లెస్టోన్ (Eng) – రూ. 1.8 Cr – UP వారియర్జ్

    7. దీప్తి శర్మ (భారతదేశం) – రూ. 2.6 కోట్లు – UP వారియర్జ్

    8. రేణుకా సింగ్ (భారతదేశం) – రూ. 1.5 కోట్లు – RCB

    9. నటాలీ స్కివర్ (ఇంగ్లండ్) – రూ. 3.2 Cr – MI

    10. తహ్లియా మెక్‌గ్రాత్ (AUS) – రూ. 1.4 కోట్లు – UP వారియర్జ్

    11. బెత్ మూనీ (AUS) – 2 కోట్లు – గుజరాత్ జెయింట్స్

    12. షబ్నిమ్ ఇస్మాయిల్ (SA) – రూ. 1 Cr – UP వారియర్జ్

    13. అమేలియా కెర్ (NZ) – రూ. 1 Cr – MI

    14. సోఫియా డంక్లీ (ఇంగ్లండ్) – రూ. 60 లక్షలు – గుజరాత్ జెయింట్స్

    15. జెమిమా రోడ్రిగ్స్ (భారతదేశం) – రూ. 2.2 Cr – DC

    16. మెగ్ లానింగ్ (Aus) – రూ. 1.1 Cr – DC

    17. షఫాలీ వర్మ (భారతదేశం) – రూ. 2 Cr – DC

    18. అన్నాబెల్ సదర్లాండ్ (AUS) – రూ. 70 లక్షలు – గుజరాత్ జెయింట్స్

    19. హర్లీన్ డియోల్ (భారతదేశం) – రూ. 40 లక్షలు – గుజరాత్ జెయింట్స్

    20. పూజా వస్త్రాకర్ (భారతదేశం) – రూ. 1.9 Cr – MI

    21. డియాండ్రా డాటిన్ (WI) – రూ. 50 లక్షలు – గుజరాత్ జెయింట్స్

    22. యస్తికా భాటియా (భారతదేశం) – రూ. 1.5 కోట్లు – MI

    23. రిచా ఘోష్ (భారతదేశం) – రూ. 1.9 కోట్లు – RCB

    24. అలిస్సా హీలీ (AUS) – రూ. 70 లక్షలు – యూపీ వారియర్జ్

    25. అంజలి సర్వాణి (భారతదేశం) – రూ. 55 లక్షలు – యూపీ వారియర్జ్

    26. రాజేశ్వరి గయాక్వాడ్ (భారతదేశం) – రూ. 40 లక్షలు – యూపీ వారియర్జ్

  • 13 Feb 2023 04:32 PM (IST)

    బెంగళూరు చేరిన మరో భారత కీపర్..

    టీ20 ప్రపంచకప్‌లో నిన్న పాకిస్థాన్‌పై 20 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన భారత కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ కోసం అన్ని జట్లు తీవ్రంగా పోరాడాయి. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం రూ.1.9 కోట్లకు దక్కించుకుంది.

  • 13 Feb 2023 04:28 PM (IST)

    ముంబై ఇండియన్స్ టీంలో చేరిన టీమిండియా వికెట్ కీపర్..

    భారత వికెట్ కీపర్ యస్తికా భాటియా రూ. 1.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌ టీంలో చేరింది.

  • 13 Feb 2023 04:19 PM (IST)

    ముంబై సొంతమైన పూజా వస్త్రాకర్..

    భారత ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ బేస్ ధర రూ. 50 లక్షలు కాగా, ముంబై ఇండియన్స్ టీం రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 04:10 PM (IST)

    ఏ జట్టులో ఏవరున్నారంటే?

    MI: హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్); నటాలీ స్కివర్ (Eng); అమేలియా కెర్ (NZ)

    RCB: స్మృతి మంధాన (భారత్); సోఫీ డివైన్ (NZ); ఎలిస్ పెర్రీ (Aus); రేణుకా సింగ్ (భారత్)

    DC: జెమిమా రోడ్రిగ్స్ (భారత్); మెగ్ లానింగ్ (Aus); షఫాలీ వర్మ (భారత్)

    GG: ఆష్లీ గార్డనర్ (Aus); బెత్ మూనీ (Aus); సోఫియా డంక్లీ (Eng)

    UP వారియర్జ్: సోఫీ ఎక్లెస్టోన్ (Eng); దీప్తి శర్మ (భారత్); తహ్లియా మెక్‌గ్రాత్ (Aus); షబ్నిమ్ ఇస్మాయిల్ (SA)

  • 13 Feb 2023 03:59 PM (IST)

    ఇప్పటి వరకు అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు..

    వేలంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు ఇవే..

    1. స్మృతి మంధాన (భారతదేశం) – 3.4 కోట్లు – RCB

    2. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారతదేశం) – 1.8 కోట్లు – MI

    3. సోఫీ డివైన్ (NZ) – 50 లక్షలు – RCB

    4. ఆష్లీ గార్డనర్ (AUS) – 3.2 Cr – GG

    5. ఎలిస్ పెర్రీ (Aus) – 1.7 Cr – RCB

    6. సోఫీ ఎక్లెస్టోన్ (Eng) – 1.8 Cr – UP వారియర్జ్

    7. దీప్తి శర్మ (భారతదేశం) – 2.6 కోట్లు – UP వారియర్జ్

    8. రేణుకా సింగ్ (భారతదేశం) – 1.5 కోట్లు – RCB

    9. నటాలీ స్కివర్ (Eng) – 3.2 Cr – MI

    10. తహ్లియా మెక్‌గ్రాత్ (Aus) – 1.4 కోట్లు – UP వారియర్జ్

    11. బెత్ మూనీ (Aus) – 2 కోట్లు – గుజరాత్ జెయింట్స్

    12. షబ్నిమ్ ఇస్మాయిల్ (SA) – 1 Cr – UP వారియర్జ్

    13. అమేలియా కెర్ (NZ) – 1 Cr – MI

    14. సోఫియా డంక్లీ (Eng) – 60 లక్షలు – గుజరాత్ జెయింట్స్

    15. జెమిమా రోడ్రిగ్స్ (భారతదేశం) – 2.2 Cr – DC

    16. మెగ్ లానింగ్ (Aus) – 1.1 Cr – DC

    17. షెఫాలీ వర్మ (భారతదేశం) – 2 Cr – DC

  • 13 Feb 2023 03:50 PM (IST)

    ఢిల్లీ టీంలో చేరిన అండర్ 19 సారథి..

    అండర్-19 ప్రపంచకప్ విజేత కెప్టెన్, భారత బ్యాటింగ్ సంచలనంగా నిలిచిన షెఫాలీ వర్మ కోసం అన్ని జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.

  • 13 Feb 2023 03:43 PM (IST)

    ఢిల్లీ సొంతమైన జెమియా రోడ్రిగ్స్..

    జెమిమా రోడ్రిగ్స్‌ బేస్‌ ధర రూ. 50 లక్షలు. ఈ ప్లేయర్ కోసం ముంబై, ఆర్‌సీబీ, ఢిల్లీ తీవ్రంగా పోరాడాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.2 కోట్లకు దక్కించుకుంది. ICC T20 వరల్డ్ కప్ 2023లో నిన్న పాకిస్తాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో జెమిమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించించింది. 38 బంతుల్లో 53 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచింది.

  • 13 Feb 2023 03:30 PM (IST)

    ముంబై టీంలో చేరిన టీ20 హిట్టర్..

    ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ రూ. 3.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌కు చేరింది. 10 టీ20 హాఫ్ సెంచరీలు సాధించి, వేలంలోనూ సత్తా చాటింది.

  • 13 Feb 2023 03:25 PM (IST)

    ఆర్‌సీబీ చేరిన రేణుకా సింగ్.. ఎంత ధర అంటే?

    రేణుకా సింగ్ కోసం RCB, DC తీవ్రంగా పోటీ పడ్డాయి. చిరవకు ఆర్‌సీబీ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది.

  • 13 Feb 2023 03:22 PM (IST)

    యూపీ వారియర్జ్‌ చేరిన దీప్తీ శర్మ..

    టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మను యూపీ వారియర్జ్‌ రూ.2.6 కోట్లకు దక్కించుకుంది.

  • 13 Feb 2023 03:11 PM (IST)

    ఇప్పటి వరకు జరిగిన వేలం ఫలితాలు ఇవే.. అత్యధిక ధర పలికిన మంధాన..

    1. స్మృతి మంధాన (భారతదేశం) – 3.4 కోట్లు – RCB

    2. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారతదేశం) – రూ.1.8 కోట్లు – MI

    3. సోఫీ డివైన్ (NZ) – రూ.50 లక్షలు – RCB

    4. హేలీ మాథ్యూస్ (WI) – అన్‌సోల్డ్

    5. ఆష్లీ గార్డనర్ (Aus) – రూ.3.2 కోట్లు – GG

    6. ఎలిస్ పెర్రీ (Aus) – రూ. 1.7 కోట్లు – RCB

    7. సోఫీ ఎక్లెస్టోన్ (Eng) – రూ. 1.8 కోట్లు – UP వారియర్జ్

  • 13 Feb 2023 02:59 PM (IST)

    ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఎవరు అమ్ముడయ్యారంటే..

    Wpl 2023 Auction1

    Wpl 2023 Auction1

  • 13 Feb 2023 02:53 PM (IST)

    ముంబై సొంతమైన హర్మన్ ప్రీత్ కౌర్..

    హర్మన్ ప్రీత్ కోసం అన్ని జట్లు భారీగా పోటీపడ్డాయి. ఇందులో ముంబై టీం రూ. 1.8 కోట్లకు సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 02:50 PM (IST)

    మంధాన రూ.3.4 కోట్లు..

    మంధాన కోసం జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆర్‌సీబీ టీం మంధానను రూ.3.4 కోట్లకు దక్కించుకుంది.

  • 13 Feb 2023 02:48 PM (IST)

    మంధానతో మొదలు..

    మంధానతో వేలం మొదలైంది. ఈమె కోసం అన్ని జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

  • 13 Feb 2023 02:47 PM (IST)

    WPL లోగో విడుదల..

    బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోగోను ఆవిష్కరించారు.

  • 13 Feb 2023 02:46 PM (IST)

    టీంతో సిద్ధమైన మిథాలీ రాజ్..

    యాంకర్ షిబానీ అక్తర్ అన్ని టీమ్‌లకు స్వాగతం పలికారు. గుజరాత్ జట్టులో భారత వెటరన్ ప్లేయర్ మిథాలీ రాజ్ కూడా ఉంది. అదే సమయంలో మైక్ హెస్సన్ RCB టేబుల్‌పై కనిపించాడు.

  • 13 Feb 2023 02:40 PM (IST)

    మొదలైన వేలం..

    మహిళల ప్రీమియర్ వేలానికి రంగం సిద్ధమైంది. అన్ని ఫ్రాంచైజీలు టేబుళ్ల వద్దకు చేరుకున్నాయి.

  • 13 Feb 2023 02:17 PM (IST)

    ఆక్షనీర్‌‌గా మల్లికా అద్వానీ

    బేస్ ప్రైజ్ ‘ఐదు బ్రాకెట్లలో’ ఉంది. తక్కువ ధర రూ. 10 లక్షలు కాగా, అత్యధికం రూ. 50 లక్షలు. మహిళా ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఆక్షనీర్ మల్లికా అద్వానీ నిర్వహించనున్నారు.

  • 13 Feb 2023 02:04 PM (IST)

    కోట్లు కురిపించనున్న భారత ఆటగాళ్లు..

    స్మృతి, షెఫాలీ, హర్మన్‌ప్రీత్, ఆల్ రౌండర్ దీప్తి శర్మ రూ. 1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు సంపాదించే ఛాన్స్ ఉంది.

  • 13 Feb 2023 01:35 PM (IST)

    లీగ్‌లోని 5 జట్లు..

    గత నెలలో మహిళల ప్రీమియర్ లీగ్‌లోని 5 జట్లు రూ. 4669.99 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ ఐదు జట్లు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో.

  • 13 Feb 2023 01:30 PM (IST)

    బేస్ ప్రైజ్ రూ. 50 లక్షల లిస్టులో 24 మంది ఆటగాళ్లు..

    రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌తో 24 మంది ఆటగాళ్లు ఈ వేలంలోకి ప్రవేశించనున్నారు. ఈ బ్రాకెట్‌లో 10 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. అదే సమయంలో 14 మంది విదేశీ ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు.

  • 13 Feb 2023 01:15 PM (IST)

    90 మందికే గోల్గెన్ ఛాన్స్..

    వేలంలో 90 స్థానాలకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. 90 స్థానాల్లో 60 స్థానాలు భారత ఆటగాళ్లకు కేటాయించగా, 30 ప్లేసుల్లో విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు.

  • 13 Feb 2023 01:10 PM (IST)

    ఫ్రాంచైజీల పర్స్‌లో రూ.12 కోట్లు..

    వేలం కోసం అన్ని ఫ్రాంచైజీల వద్ద రూ.12 కోట్ల పర్స్ ఉంది. ఈ మొత్తంతో, జట్లు గరిష్టంగా 18, కనీసం 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

  • 13 Feb 2023 01:02 PM (IST)

    1525 మంది ప్లేయర్లలో..

    ప్రపంచ వ్యాప్తంగా 1525 మంది ఆటగాళ్లు WPL వేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. చివరకు 409 మంది ఆటగాళ్లు తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

  • 13 Feb 2023 01:02 PM (IST)

    WPL వేలంలో 409 మంది ఆటగాళ్లు..

    మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ముంబైలో జరుగుతోంది. 409 మంది ఆటగాళ్ల భవితవ్యాన్ని 5 జట్లు నిర్ణయించనున్నాయి. వేలం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేలం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది.

Published On - Feb 13,2023 1:01 PM