IND vs PAK: అదరగొట్టిన భారత అమ్మాయిలు.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం

అండర్ 19 మహిళల ఆసియా కప్ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. ఆదివారం (డిసెంబర్ 15) జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసింది.

IND vs PAK: అదరగొట్టిన భారత అమ్మాయిలు.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం
India Vs Pakistan
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2024 | 6:22 PM

అండర్ 19 మహిళల ఆసియా కప్ 2024లో భారత క్రికెట్ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 68 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 7.5 ఓవర్లలోనే అందుకుంది. లక్ష్య ఛేదనలో రెండో బంతికే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జి త్రిష పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరుకుంది. అయితే ఆ తర్వాత కమిలినీ, సానికా చాల్కే జోడీ 67 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా విజయం సాధించింది. టీమ్ ఇండియా తరఫున జి కమిలిని అత్యధిక పరుగులు చేసింది. కమిలి 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 44 పరుగులు చేసింది. సానికా చాల్కే 17 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 19 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయంతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్ల ముందు పాకిస్థాన్ మోకరిల్లింది. పాకిస్థాన్ 20 ఓవర్లు పూర్తిగా ఆడింది. కానీ 70 పరుగులు కూడా చేయలేకపోయింది. ఆఖరికి అన్నీ ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కోమల్ ఖాన్ పాకిస్థాన్ తరఫున అత్యధికంగా 24 పరుగులు చేసింది. ఫాతిమా ఖాన్ 11 పరుగులు చేసింది. ఇతర బ్యాటర్లు రెండంకెల స్కోరుకు కూడా చేయలేదు. జోషిత వీజే, మిథిలా వీ, పరుణికా సిసోడియా తలో వికెట్ తీశారు. సోనమ్ యాదవ్ 4 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. సోనమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో సత్కరించింది

మహిళల టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

నికి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే, జి త్రిష, జి కమిలిని (వికెట్ కీపర్), భావికా అహిరే, మిథిలా వి, జోషిత విజె, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, షబ్నమ్ ఎండి షకీల్.

మహిళల పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:

జుఫీషన్ అయ్యాజ్ (కెప్టెన్), కోమల్ ఖాన్ (వికెట్ కీపర్), ఫిజా ఫైజ్, ఖురతులైన్, మహమ్ అనీస్, ఫాతిమా ఖాన్, రోసినా అక్రమ్, రావాలి ఫర్హాన్, మహేనూర్ జెబ్, అరిషా అన్సారీ, అలీసా ముఖ్తియార్,

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..