
Tom Banton Brake 150 year Record: ఐపీఎల్ (IPL) 2025 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ధరతో ప్రవేశించిన ఓ ఇంగ్లాండ్ ఆటగాడికి బిగ్ షాక్ తగిలింది. ఏ ఫ్రాంచైజీ కూడా ఈ ఆటగాడిపై ఆసక్తి చూపలేదు. అంటే, వేలంలో అమ్ముడుకాలేదు. ఎన్నో ఆశలతో ఐపీఎల్‌లో ఆడదామనుకున్న ఈ ఇంగ్లండ్ ప్లేయర్ ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఇంగ్లండ్ ఆటగాడి పేరు టామ్ బాంటన్. అయితే, ఏది జరిగినా అది మన మంచికే అని అంటుంటారు. ఈ ఇంగ్లండ్ ప్లేయర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఐపీఎల్ 2025లో అమ్ముడుపోని బాంటన్.. ఇప్పుడు సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ డివిజన్ 1 మ్యాచ్‌లో ఆడుతూ 150 సంవత్సరాల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అంటే, కౌంటీ డివిజన్‌లో అత్యధిక స్కోరు సాధించాడు. అతను వోర్సెస్టర్‌షైర్‌పై ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు.
రెండవ రోజు ముగిసే సమయానికి, టామ్ బాంటన్ 381 బంతులు ఎదుర్కొని 53 ఫోర్లు, 1 సిక్స్‌తో సహా 344 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు మొత్తం 496 నిమిషాలు బ్యాటింగ్ చేశాడు. 344 పరుగులతో అజేయంగా ఉన్న బాంటన్.. ఇప్పుడు మూడవ రోజు తన స్కోరును ఎంత వరకు తీసుకెళ్తాడో చూడాలి. 400 పరుగులకు మించి తీసుకెళ్తే అది మరో రికార్డ్ అవుతుందన్నమాట.
టామ్ బాంటన్ చేసిన 344 పరుగులు సోమర్సెట్ 150 ఏళ్ల చరిత్రలో ఏ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ విషయంలో, అతను ఆస్ట్రేలియాకు చెందిన జస్టిన్ లాంగర్ 342 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. లాంగర్ 2006లో సర్రేపై ఈ స్కోరు చేశాడు. ఆ తర్వాత 1985లో వార్విక్‌షైర్‌పై వివియన్ రిచర్డ్స్ చేసిన 322 పరుగుల స్కోరును అతను అధిగమించాడు. కానీ ఇప్పుడు టామ్ బాంటన్ ఈ ఇద్దరినీ వెనుకంజలోకి నెట్టేశాడు. జస్టిన్ లాంగర్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఇదెక్కడి చెత్త బ్యాటింగ్ సామీ.. చూడలేక నిద్రలోకి జారుకున్న చెన్నై ఆటగాడు
టామ్ బాటెన్ మారథాన్ ఇన్నింగ్స్ ప్రభావం అతని జట్టు సోమర్సెట్ వోర్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోరు బోర్డుపై స్పష్టంగా కనిపించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 637 పరుగులు చేసింది. వోర్సెస్టర్‌షైర్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో సోమర్‌సెట్ 483 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా 4 వికెట్లు మిగిలి ఉన్నాయి. వోర్సెస్టర్‌షైర్ గురించి మాట్లాడుకుంటే, తొలి ఇన్నింగ్స్ 154 పరుగులకే పరిమితం అయింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..