Asia Cup 2023 Final: టైటిల్ పోరులో భారత్, శ్రీలంక ఢీ.. కప్ గెలవాలంటూ రోహిత్ శర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పిన విక్టరీ వెంకటేష్..
Asia Cup 2023 Final: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాకు టాలీవుడ్ వెంకీ మామ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అద్భుతమైన క్యాప్షన్‌తో రోహిత్ శర్మకు కప్ గెలుచుకు రావలంటూ కోరాడు. ఈ ట్వీట్ కోసం వెంకటేష్.. తాను రోహిత్ శర్మతో ఉన్న ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. క్రికెట్ అంటే మాంచి జోష్ మీదుండే వెంకటేష్ టీమిండియాకు అల్ ది బెస్ట్ చెబుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా..
Asia Cup 2023 Final: భారత్, శ్రీలంక మధ్య జరగబోయే ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ఇంకా కొంత సమయమే మిగిలి ఉంది. లంకపై 9వ సారి టోర్నీ ఫైనల్ ఆడుతున్న భారత్ ఎలా అయినా గెలవాలని ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. జస్ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్‌తో పాటు చివరి మ్యాచ్‌లో వాటర్ బాయ్ అవతారమెత్తిన విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ జట్టులోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన ప్లేయర్లు లంకపై విజృంభించాలని.. సెంచరీలు, రికార్డులు నమోదు చేయాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలోనే టీమిండియాకు టాలీవుడ్ వెంకీ మామ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘Cheering for all our boys in blue! Bring the cup home, Captain’ అనే క్యాప్షన్‌తో రోహిత్ శర్మకు కప్ గెలుచుకు రావలంటూ కోరాడు. ఈ ట్వీట్ కోసం వెంకటేష్.. తాను రోహిత్ శర్మతో ఉన్న ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. క్రికెట్ అంటే మాంచి జోష్ మీదుండే వెంకటేష్ టీమిండియాకు అల్ ది బెస్ట్ చెబుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు.
Cheering for all our boys in blue! Bring the cup home, Captain. @ImRo45 @BCCI#AsiaCup2023 #INDvsSL pic.twitter.com/CnE3QBEMVW
ఇవి కూడా చదవండి— Venkatesh Daggubati (@VenkyMama) September 17, 2023
విక్టరీ వెంకటేష్ చేసిన పోస్ట్‌పై స్పందిస్తూ పలువురు నెటిజన్లు ‘క్రికెట్ అంటే వెంకీ మామకు లవ్వు’.., ‘హిట్ మ్యాన్ అండ్ విక్టరీ’.., ‘వెంకీ మామ కోసం రోహిత్ విక్టరీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కొందరు రకరకాల మీమ్స్, స్టిక్సర్స్‌తో అటు టీమిండియాకు, ఇటు వెంకటేష్‌కి గ్రీటింగ్స్ చెబుతున్నారు.
భారత్ vs శ్రీలంక
ఇదిలా ఉండగా.. ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడడం ఇది 9వ సారి. ఈ క్రమంలో లంకపై భారత్ 5 సార్లు.. టీమిండియాపై శ్రీలంక 3 సార్లు విజయం సాధించాయి. విశేషం ఏమిటంటే.. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ భారత్, శ్రీలంక ఆసియా కప్ టైటిల్ మ్యాచ్ బరిలోకి దిగబోతున్నాయి. ఇరు దేశాలు చివరిసారిగా ఆసియా కప్ 2010 ఫైనల్‌లో తలపడగా.. అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని బ్లూ ఆర్మీ లంకపై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది.
The Battle for the Asian Crown! 🏆👑 Join us on September 17th at RPICS, Colombo for an epic showdown!
Secure your tickets today – https://t.co/9abfJNKjPZ#AsiaCup2023 #SLvIND pic.twitter.com/jsYVGgVkLM
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..