
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2023) ఆరో మ్యాచ్‌లో, నెల్లై రాయల్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో లైకా కోవై కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు సాధించింది. అజితేష్ గురుస్వామి అద్భుత సెంచరీతో నెల్లై రాయల్ కింగ్స్ చివరి బంతికి ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అజితేష్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
నెల్లై రాయల్ కింగ్స్ కెప్టెన్ అరుణ్ కార్తీక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లైకా కోవై కింగ్స్ ఆరంభం బాగాలేకపోవడంతో జట్టు కేవలం 2 పరుగుల స్కోరుకే తొలి దెబ్బ తగిలింది. బి. సచిన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అనంతరం సురేశ్ కుమార్, సాయి సుదర్శన్‌లు ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేసి రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సురేష్ కుమార్ 24 బంతుల్లో 33 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు. ఇక సాయి సుదర్శన్ కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి జట్టును భారీ స్కోరుకు చేర్చాడు.
లక్ష్యాన్ని ఛేదించిన నెల్లై రాయల్ కింగ్స్ కేవలం ఒక్క పరుగుకే షాక్ తగిలింది. కెప్టెన్ అరుణ్ కార్తీక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శ్రీ నిరంజన్, అజితేష్ గురుస్వామిలు ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేసి రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిరంజన్ 25 పరుగులు చేయగా, అజితేష్ ఒక ఎండ్‌లో నిలిచాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేశాడు. జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా 20వ ఓవర్ చివరి బంతికి ఈ లక్ష్యాన్ని సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..