ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
Tilak Varma: దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌లో రెండు అద్భుత సెంచరీలు చేసిన తిలక్ వర్మ విజయ్ హజారే ట్రోఫీలో నిరాశపరిచాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు ఎదుర్కొని సున్నాకే ఔటయ్యాడు. అంతకుముందు నాగాలాండ్‌పై కూడా తిలక్ సున్నాకి అవుటయ్యాడు.
జాతీయ జట్టులో సీడీసీ రికార్డులపై సెంచరీల రికార్డును లిఖించిన టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అంతగా రాణించలేకపోతున్నారు. నెల రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలతో రికార్డు స్పష్టించిన తిలక్ వర్మ ఇప్పుడు దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయాడు.
గత నవంబర్‌లో టీమిండియా 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ సమయంలో జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మ.. వరుసగా రెండు టీ20ల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్‌లో జరిగిన మూడో T20Iలో అజేయంగా 107 పరుగులు చేసిన తర్వాత, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 4వ T20Iలో అజేయంగా 120 పరుగులు చేయడం ద్వారా తిలక్ వర్మ తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం తిలక్ వర్మ ఫాప్ షో కనబరించాడు. 2 రోజుల క్రితం ప్రారంభమైన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ ఫ్లాప్ షో కొనసాగింది. వరుసగా 2 మ్యాచ్‌ల్లో సున్నాకి అవుటయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ.. ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో మళ్లీ ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. అంతకుముందు నాగాలాండ్‌పై కూడా తిలక్ సున్నాకి అవుటయ్యాడు.
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 50 ఓవర్లు మొత్తం ఆడలేక 38.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో ఆ జట్టు 130 పరుగులు చేసే సమయంలో 5 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత కూడా కోలుకోలేక స్వల్ప పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించారు. ముంబై తరఫున వినోద్ 4, ఆయుష్ మ్హత్రే 3 వికెట్లు తీశారు. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై జట్టు కూడా విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తనుష్ కొట్యాన్ అజేయంగా 39, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులతో పేలుడు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు 7 వికెట్లు కోల్పోయి 25.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి