IPL Auction: సీఎస్కే లేదా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లాలని ఉందన్న టీమిండియా బౌలర్

టీమిండియా పేసర్ దీపక్ చాహర్, 2025 ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన కోసం మళ్లీ బిడ్ వేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో CSK తరపున ఆడిన అనుభవంతో పాటు, పవర్‌ప్లేలో వికెట్లు తీయగల తన నైపుణ్యం CSKకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. CSK కాకుంటే రాజస్థాన్ రాయల్స్ తన కోసం బిడ్ వేయవచ్చని చాహర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

IPL Auction: సీఎస్కే లేదా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లాలని ఉందన్న టీమిండియా బౌలర్
Deepak Chahar
Follow us
Narsimha

|

Updated on: Nov 13, 2024 | 2:17 PM

టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్ లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స తరఫున ఆడతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. తన మాజీ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన కోసం 2025 ఐపీఎల్ మెగా వేలంలో బిడ్ చేసే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాడు. గతంలో చాలా కాలం పాటు CSK తరపున ఆడిన చాహర్, 2022 సీజన్‌కు CSK రిటైన్ చేసుకోలేదు అయితే వేలంలో అతడిని రూ. 14 కోట్లకు కొనుగోలు చేశారు. ఇటీవల జరిగిన ఒక ఇంటరాక్షన్‌లో, మళ్లీ CSK తరపున ఆడాలని తన కోరికను వ్యక్తం చేసిన చాహర్, పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లు తీయగల తన నైపుణ్యం ప్రస్థుత క్రికెట్లో తన బలమని అదే తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు.

చాహర్ గతంలో గాయాల కారణంగా చాలా మ్యాచ్‌లు మిస్ అయినప్పటికీ, గతంలో సీఎస్కే తరఫున అతని ప్రదర్శనే మరోసారి ఆ జట్టు తన కోసం బిడ్డింగ్ వేసేలా చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.  “గత మెగా వేలంలో కూడా వారు నన్ను రిటైన్ చేసుకోలేదు, కానీ నా కోసం భారీ ధరకు వేలంలో పోటీ పడ్డారు. ఈ సారి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నాకున్న నైపుణ్యాన్ని మాత్రమే నమ్ముకుంటున్నాను. క్రికెట్ రాను రాను బ్యాట్స్మెన్ కు ఫేవర్ గా మారుతోంది. పవర్‌ప్లేలో 90-100 రన్స్ వరకు స్కోర్ వస్తోంది, దీంతో జట్లు 200 పైగా స్కోర్ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది . నేను పవర్‌ప్లేలో రన్స్ కట్టడి చేయగల ముఖ్యమైన ఆటగాడిగా నిరూపించుకున్నాను,” అని చాహర్ పేర్కొన్నాడు.

వేలానికి ముందు CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే, మతీషా పతిరానాలను రిటైన్ చేసుకుంది. CSK వద్ద ఇప్పుడు రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ లేదు. “నేను మళ్లీ CSK తరపున ఆడాలని అనుకుంటున్నాను,  సీఎస్కే కాకుంటే రాజస్థాన్ రాయల్స్ నా కోసం బిడ్ చేయాలని కోరుకుంటున్నాను” అని చాహర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. చూడాలి మరి మేగా వేలంలో సీఎస్కే దీపక్ చాహర్ ను కొనుగోలు చేస్తుందా లేక రాజస్థాన్ రాయల్స్ అతని కోసం పోటీ పడుతుందా లేదా తెలియాలంటే నవంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.

రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చడుగా
రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చడుగా
ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు..
ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు..
ముంబైలో అనేక సినిమా షూటింగ్స్ జరుపుకున్న పోర్ట్స్ పై ఓలుక్ వేయండి
ముంబైలో అనేక సినిమా షూటింగ్స్ జరుపుకున్న పోర్ట్స్ పై ఓలుక్ వేయండి
వాకింగ్ కోసం వచ్చిన వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
వాకింగ్ కోసం వచ్చిన వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
బిగ్ బాస్ స్టేజ్ పై స్టార్ హీరోను ఇమిటేట్ చేసిన ప్రియమణి..
బిగ్ బాస్ స్టేజ్ పై స్టార్ హీరోను ఇమిటేట్ చేసిన ప్రియమణి..
తండ్రి అంత్యక్రియలు చేస్తుంటే కనిపించని కొడుకు.. ఆరా తీయగా..
తండ్రి అంత్యక్రియలు చేస్తుంటే కనిపించని కొడుకు.. ఆరా తీయగా..
కలలో నలుపు, తెలుపు పాము కనిపిస్తే ఎటువంటి సంకేతాలు అంటే
కలలో నలుపు, తెలుపు పాము కనిపిస్తే ఎటువంటి సంకేతాలు అంటే
శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య - శోభిత
శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య - శోభిత
ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్
ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా ప్రొడ్యూసర్ దిల్ రాజు..
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా ప్రొడ్యూసర్ దిల్ రాజు..