IPl Auction: ఆ సఫారీ ఆటగాడు కోట్లు కొల్లగొట్టడం ఖాయం: దినేష్ కార్తిక్

ఇండియా-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో తన అద్భుత ఆటతో ఆకట్టుకుంటున్న జెరాల్డ్ కోయెట్జీ రాబోయే ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడవుతాడని మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కోయెట్జీ కొత్త బంతితో స్వింగ్ చేయడంతో పాటు, చివర్లో సిక్సర్లు కొట్టగల బ్యాటింగ్ నైపుణ్యం కూడా కలిగి ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున గత సీజన్‌లో మంచి ప్రదర్శన చేసిన కోయెట్జీ ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరిగే ఐపీఎల్ 2025 వేలంలో ప్రాంచైజీలకు ప్రధాన ఆకర్షణగ నిలవనున్నాడు.

IPl Auction: ఆ సఫారీ ఆటగాడు కోట్లు కొల్లగొట్టడం ఖాయం: దినేష్ కార్తిక్
Gerald Coetzee
Follow us
Narsimha

|

Updated on: Nov 13, 2024 | 1:38 PM

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో జెరాల్డ్ కోయెట్జీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోయెట్జీ కొత్త బంతిని స్వింగ్ చేయడమే కాదు చేంజ్ ఆఫ్‌ పేస్ తో డెత్ ఓటర్లలో వికెట్లు కూడా తయగలడు. అంతే కాదు బ్యాటంగ్ లోను చివర్లో సిక్సర్లు కొట్టే నైపుణ్యం ఉన్న ఆటగాడు కోయోట్జీ. ఈ టాలెంటెడ్ ప్లేయర్ కోసం రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో ప్రాంచైజీలు కాసులు కుమ్మరించడం ఖాయమన్ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.

“దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతనికి ఎంత ఇస్తోందో నాకు తెలియదు, కానీ రెండు వారాల్లో అతను పెద్ద మొత్తంలో చెక్ తీసుకుంటాడు అనిపిస్తోంది. కోయెట్జీ తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతనో తెలివైన క్రికెటర్ అని ప్రశంచించాడు. ఒక బౌలర్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా సేవలు అందించే ఈ ఆల్ రౌండర్ కోసం వేలంలో ప్రాంచైజీలు పోటీ పడటం ఖాయమన్నారు. ఇలాంటి ఆటగాళ్లు ఉండటం దక్షిణాఫ్రికాకు అదృష్టమన్నారు. ఆ జట్టు బ్యాటింగ్ డెప్త్ ఎంత  ఉంది అని చెప్పడానికి మార్కో జాన్సెన్ ఏడు స్థానంలో, కోయెట్జీ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం ఒక ఉదాహరణ” అని కార్తిక్ తెలిపాడు.

టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ కూడా కోయెట్జీ ని ఆకాశానికెత్తాడు. అతడికి బ్యాటింగ్ లో కూడ మంచి నైపుణ్యం ఉంది. తాను ఒక బౌలర్ అయినప్పటికి బ్యాటర్ గా కూడా సేవలు అందించడం నిజంగా గొప్పవిషయమన్నారు. దీనికోసం అతను ఎంతో శ్రమిస్తున్నాడనిపిస్తోంది. ఆటలో అన్ని భాగాల్లోనూ తన పాత్ర ఉండాలని కోయోట్జీ కోరుకుంటున్నాడు.

కోయెట్జీ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. 10 మ్యాచులు ఆడిన అతడు 13 వికెట్లు తీసి 10.18 ఎకానమీతో మంచి ప్రదర్శనను కనబరిచాడు. గత సీజన్ లో ఐపీఎల్ వేలంలో 5 కోట్ల ధరకు ముంబై అతన్ని దక్కించుకుంది.  ఈ నెల 24, 25 తేదీలలో జెడ్డా, సౌదీ అరేబియాలో జరగనున్న ఐపీఎల్ 2025 ప్లేయర్ ఆక్షన్ కోసం 1574 ఆటగాళ్లు నమోదు చేసుకున్నారని బీసీసీఐ ప్రకటించింది.

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!