AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA: సఫారీలతో ఫైనల్ మ్యాచ్.. టీమిండియాలో ఆ 5గురి ప్లేయర్స్‌కి అగ్నిపరీక్ష.. వారెవరంటే

28 రోజులు.. 54 మ్యాచ్‌లు.. ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్ 2024 చివరి ఘట్టానికి చేరుకుంది. శనివారం బార్బోడస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అటు సఫారీలకు 26 ఏళ్ల కల కాగా.. ఇటు భారత్‌కి 11 ఏళ్ల కల.. వీరిద్దరిలో ఒకరు ప్రపంచకప్ విజేతగా నిలవనుండగా..

IND Vs SA: సఫారీలతో ఫైనల్ మ్యాచ్.. టీమిండియాలో ఆ 5గురి ప్లేయర్స్‌కి అగ్నిపరీక్ష.. వారెవరంటే
Ind Vs Sa
Ravi Kiran
|

Updated on: Jun 29, 2024 | 12:52 PM

Share

28 రోజులు.. 54 మ్యాచ్‌లు.. ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్ 2024 చివరి ఘట్టానికి చేరుకుంది. శనివారం బార్బోడస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అటు సఫారీలకు 26 ఏళ్ల కల కాగా.. ఇటు భారత్‌కి 11 ఏళ్ల కల.. వీరిద్దరిలో ఒకరు ప్రపంచకప్ విజేతగా నిలవనుండగా.. మరొకరి ఆశ అడియాశగానే మిగిలిపోనుంది. టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్‌లో తమ సత్తా చాటేందుకు అటు దక్షిణాఫ్రికా, ఇటు భారత్ తహతహలాడుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లకు సమ్బంధించిన క్రికెటర్లు పిచ్‌పై అధ్యయనం మొదలెట్టేశారు. ఈ తరుణంలో ఈ 10 మంది పోటీ చూడాల్సిందేనని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

విరాట్ కోహ్లీ Vs కగిసో రబాడ

విరాట్ కోహ్లీ, రబాడ మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా ఉంటుంది. టోర్నీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 75 పరుగులు మాత్రమే చేసిన విరాట్‌పై ఫైనల్‌లో టీమిండియా ఆశలు పెట్టుకుంది. అలాంటి పరిస్థితిలో అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టేందుకు దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ రబాడ లక్ష్యంగా పెట్టుకున్నాడు. టోర్నీలో రబాడ 5.88 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు.

రోహిత్ శర్మ Vs మార్కో జాన్సన్

2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ భారత్, దక్షిణాఫ్రికా మధ్య రసవత్తరంగా మారనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే.. మార్కో జాన్సన్ ఎడమచేతి వాటం బౌలర్.. అలాగే టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా అత్యంత విజయవంతమైన బౌలర్. రోహిత్‌కి జాన్సన్ ధీటైన బౌలర్. జాన్సన్‌తో ఇప్పటివరకు ఆడిన 9 T20I ఇన్నింగ్స్‌లలో రోహిత్ 113 పరుగులు చేశాడు. అలాగే ఓసారి ఔట్ అయ్యాడు.

జస్ప్రీత్ బుమ్రా Vs క్వింటన్ డికాక్

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో బుమ్రా, డికాక్‌ల మధ్య భారీ పోరు జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున డికాక్ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్ కాగా.. టీమ్ ఇండియా అత్యుత్తమ బౌలర్ బుమ్రా.

రిషబ్ పంత్ Vs కేశవ్ మహారాజా

టీమ్ ఇండియా తరపున 3వ స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు రిషబ్ పంత్. అలాంటి పరిస్థితిలో, దక్షిణాఫ్రికా తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజాను మొదటి 10 ఓవర్లలో ఉపయోగించవచ్చు.

కుల్దీప్ యాదవ్ Vs హెన్రిచ్ క్లాసెన్

భారత్, దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్ల బరిలోకి దిగితే అరివీర భయంకరులే.. ఫైనల్‌లో కీలక పాత్ర పోషిస్తారు. చైనామాన్ కుల్దీప్ బంతులను మిడిల్ ఓవర్లలో క్లాసెన్ ఎలా ఆడతాడో చూడాలి. దానిపైనే దక్షిణాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

ఇది చదవండి: రషీద్ భాయ్.! ఎందుకీ తలపొగరు.. చేజేతులా మ్యాచ్‌ను చెడగొట్టావ్ పో.. ఇదిగో ప్రూఫ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..