ఐపీఎల్ 2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. మూడోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా సరిపెట్టుకుంది. వరుసగా మూడు సీజన్ల నుంచి అట్టుడుగున నిలిచిన SRH జట్టు.. ఈసారి పాట్ కమిన్స్ సారథ్యంలో రెండో స్థానంలో నిలిచిన.. ఫైనల్స్ వరకు చేరింది. అయితేనేం ఆఖరి మజిలీ దగ్గర తడబడి ట్రోఫీకి దూరమైంది. ఈ సీజన్‌కు ముందుగానే వనిందు హసరంగాను కోల్పోయిన SRH.. పవర్‌ప్లే హార్డ్ హిట్టింగ్‌తో ప్రత్యర్ధులను హడలెత్తించింది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్ చూపించిన కేకేఆర్ మాదిరిగానే.. SRH కూడా సేమ్ టీంతో ఐపీఎల్ 2025కి వెళ్లాలని యోచిస్తోంది. కానీ అంతకంటే ముందే మెగా వేలంలో మళ్లీ జట్టును పునర్నిర్మించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య చాలా తక్కువ. అయితే ఒక్కో జట్టు 8 వరకు రిటెన్షన్‌లను ఉంచుకునేలా అనుమతించాలని.. బీసీసీఐకి విజ్ఞప్తి చేయగా.. ఇందుకు బోర్డు సుముఖంగా లేదు. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రతీ ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్(RTM) కార్డ్‌తో పాటు కనీసం 4 మంది ఆటగాళ్లను( 2 విదేశీ ప్లేయర్లు, 2 ఇండియన్ ప్లేయర్లు) మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంది.
డిసెంబర్ 2024 – ఫిబ్రవరి 2025 మధ్య జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్నద్దమవుతోంది. జట్టును మళ్లీ బలోపేతం చేసే దిశగా.. ఈ సీజన్‌లో విజయాలను అందించిన కీలక ప్లేయర్లను మళ్లీ మెగా వేలంలో కొనుగోలు చేయాలనీ చూస్తోంది. ఇక రిటైన్ లిస్టు విషయానికొస్తే.. కచ్చితంగా SRH మొదటి ఎంపిక ఓపెనర్ అభిషేక్ శర్మ కావచ్చు. అతడు తన పేలుడు ఇన్నింగ్స్‌లతో సీజన్ అంతటా రచ్చలేపాడు. సెకండ్ రిటైన్ ప్లేయర్ ట్రావిస్ హెడ్..ఈ సీజన్ మొత్తానికి హెడ్, అభిషేక్ ఓపెనింగ్‌లో చెలరేగిపోయి ఆడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తదుపరి రెండు రిటైన్ ప్లేయర్స్‌పై మాత్రం ఆసక్తి నెలకొంది. భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, నటరాజన్ ఇలా చాలా మంది లిస్టులో ఉన్నారు. కానీ ఫ్రాంచైజీ కచ్చితంగా నితీష్ రెడ్డి, నటరాజన్ వైపే మొగ్గు చూపించవచ్చునని తెలుస్తోంది. అటు షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్‌లను RTM ద్వారా తిరిగి దక్కించుకోవచ్చునట. ఇక మెగా వేలంలోకి వచ్చిన ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్‌ను మళ్లీ కొంత తక్కువ ధరకు దక్కించుకోవాలని కావ్య మారన్ భావిస్తోందట. అటు గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్‌లను కూడా మెగా వేలంలోకి వచ్చినట్టే. మరి మళ్లీ కావ్య మారన్ తిరిగి దక్కించుకుంటుందో.? లేదో.? చూడాలి.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, టి. నటరాజన్
నితీష్ రెడ్డి/షాబాజ్ అహ్మద్, నటరాజన్/భువనేశ్వర్ కుమార్
ఇది చదవండి: కోట్లు ఖర్చయినా పర్లేదు.. మెగా వేలంలోకి రోహిత్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.! ఈసారి మోత మోగాల్సిందే..
మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..