Mithali Raj- Duologue With Barun Das: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌తో మహిళా క్రికెట్‌కు మహర్దశ.. మట్టిలో మాణిక్యాలకు ఇది సువర్ణావకాశం

| Edited By: Ravi Kiran

Feb 10, 2023 | 11:51 AM

ఈ మెగా క్రికెట్ లీగ్‌తో మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ దక్కుతుందని, అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రముఖ హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ అభిప్రాయపడ్డారు. వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారామె.

Mithali Raj- Duologue With Barun Das: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌తో మహిళా క్రికెట్‌కు మహర్దశ.. మట్టిలో మాణిక్యాలకు ఇది సువర్ణావకాశం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల ప్రకటనతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మహిళల క్రికెట్‌లో కొత్త శకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆటగాళ్ల వేలం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, మిథాలీ రాజ్ వంటి దిగ్గజ ప్లేయర్‌ను మరోసారి చూసే అవకాశం తమకు లభిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు.
Follow us on

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌కు (WPL) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్‌, డీవై పాటిల్‌ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్‌ ప్రారంభంకానుంది. 22 రోజుల పాటు సాగే ఈ మెగా క్రికెట్‌ టోర్నీ మార్చి 26తో ముగియనుంది. కాగా ఈ మెగా లీగ్‌తో మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ దక్కుతుందని, అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రముఖ హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ అభిప్రాయపడ్డారు. వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారామె. ఈ క్రమంలో TV9 నెట్‌వర్క్ ఎండీ అండ్‌ సీఈవో బరున్‌దాస్ డ్యుయోలాగ్‌(Duologue with Barun Das)కు హాజరైన ఆమె వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొత్తం నాలుగు ఎపిసోడ్ల ఈ ఇంటర్వ్యూలో భాగంగా  పురుషాధిపత్యం ఉన్న  క్రికెట్లో మహిళలు రాణించేందుకు అవకాశాలు, ఎదురవుతోన్న అడ్డంకులపై బరున్ దాస్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు మిథాలి.  ‘ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ ఎంత క్రేజ్‌ తెచ్చుకుందో మహిళా ప్రీమియర్‌ లీగ్‌ కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుంది. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేవారికి ఈ టోర్నీ ఒక సదవకాశం. ఈ మెగా లీగ్‌ ద్వారా భవిష్యత్తులో ఎంతో మంది క్రికెట్‌ తారలు వెలుగులోకి వస్తారు. భవిష్యత్ ఛాంపియన్‌లను సృష్టించడం అనేది అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభం కావాలి. ప్రతిభ ఉన్న క్రికెటర్లకు మౌలిక సదుపాయాలను కల్పించాలి. సామాజిక పక్షపాతాలు కూడా దూరం కావాలి’ అని చెప్పుకొచ్చారు మిథాలీరాజ్‌. దీంతో పాటు భారతదేశంలో మహిళల క్రికెట్‌కు ఇంకా ఆదరణ పెంచే వివిధ మార్గాలు, అవకాశాలను వివరించారీ హైదరాబాదీ క్రికెటర్‌.

కాగా వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొనే క్రికెటర్ల వేలం ఈ నెల 13న జరగనుంది. వేలం కోసం ఇప్పటివరకు 1525 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఇందులో 409 మందిని మాత్రమే తుది జాబితాలో చేర్చినట్టు బీసీసీఐ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లకు చెందిన పలువురు క్రికెటర్లు కూడా ఈ వేలంలోకి రానున్నారు. ఇప్పటికే భారత మహిళల సీనియర్ జట్టుకు ఆడిన ఏపీ క్రికెటర్లు స్నేహ దీప్తి, అంజలి శర్వాణి, సబ్బినేని మేఘనతో పాటు హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి ఈ వేలంలో పాల్గొన్నారు. అలాగే అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆడిన గొంగడి త్రిష, షబ్నిమ్ కూడా డబ్ల్యూపీఎల్‌ ఆక్షన్‌లోకి రానున్నారు. మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్‌లో ఆరంభ మ్యాచ్‌ గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీల మధ్య జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..