Krunal Pandya : అది కృనాల్‌ పాండ్య స్పిరిట్..! రాహుల్ ద్రావిడ్ ఎఫెక్ట్.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

|

Jul 19, 2021 | 4:33 PM

Krunal Pandya : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన భారత్, శ్రీలంక మొదటి వన్డేలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక క్రికెటర్

Krunal Pandya : అది కృనాల్‌ పాండ్య స్పిరిట్..! రాహుల్ ద్రావిడ్ ఎఫెక్ట్.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
Krunal Pandya
Follow us on

Krunal Pandya : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన భారత్, శ్రీలంక మొదటి వన్డేలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంకను భారత ఆల్‌రౌండర్ కృనాల్‌ పాండ్య హగ్ చేసుకోవడం అందరికి నచ్చింది. దీంతో ట్విట్టర్ వేదికగా కృనాల్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. కృనాల్‌ పాండ్య బౌలింగ్ చేస్తున్న 22వ ఓవర్‌ మూడో బంతికి ఈ సంఘటన జరిగింది. అప్పుడు ధనంజయ డిసిల్వా, అసలంకా క్రీజులో ఉన్నారు.

స్ట్రైక్‌లో ఉన్న డిసిల్వా బంతిని బలంగా బాదడంతో స్టెయిట్‌గా వచ్చిన బంతిని కృనాల్‌ పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంలో పక్కన ఉన్న నాన్ స్ట్రైకర్ అసలంకావైపు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన కృనాల్‌ లేచి అసలంకాను హగ్ చేసుకున్నాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన కృనాల్‌ పాండ్యను ట్విట్టర్ వేదికగా పలువురు క్రికెటర్లు అభినందిస్తున్నారు. కొందరు ఇది ‘రాహుల్ ద్రవిడ్ ఎఫెక్ట్’ అని కూడా అంటున్నారు. ప్రస్తుతం టిమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

భారత శిబిరం నుంచి కృనాల్‌ అత్యంత ముఖ్యమైన బౌలర్‌. అతను తన 10 ఓవర్ల కోటాను ఎకానమీ రేటుతో పూర్తి చేశాడు. ఓవర్‌కు మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ఆతిథ్య జట్టును బ్యాక్‌ఫుట్‌లోకి నెట్టాడు. తొలి వన్డేలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 262 పరుగులు చేసింది. మూడు వికెట్ల నష్టానికి భారత్ 36.4 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయంగా 86 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 59 పరుగులు చేశాడు. కుల్దీప్ రెండు వికెట్లు సాధించాడు.

Childhood Love-Murder: ప్రియుడి మోజులో భర్తకు స్పాట్‌.. చిన్ననాటి ప్రేమికుడి కోసం భర్తను ఖతం చేసిన భార్య..

Weight Lose : బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..! అయితే ముందుగా మీ కేలరీల సంఖ్యను లెక్కించండి..

Munagaku: ఆషాడ మాసంలో మునగాకు కూర ఎందుకు తింటారు..? అసలు దీని ప్రయోజనాలు ఏంటి..?