Mohammed Siraj: హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ

|

Oct 11, 2024 | 8:54 PM

టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కూడా కేటాయించారు

Mohammed Siraj: హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ
Mohammed Siraj
Follow us on

టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కూడా కేటాయించారు. శుక్రవారం (అక్టోబర్ 11) రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పోలీసు శాఖ‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా 2024 T20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాలో భాగమయ్యాడీ హైదరాబాదీ పేసర్. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయం సాధించిన తర్వాత సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అందుకే మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. ఈరోజు ఆ ఉద్యోగ బాధ్యతలను కూడా సిరాజ్ స్వీకరించారు. అయితే ఇది అతని క్రికెట్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు.

భారత టీ20 ప్రపంచకప్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్ సిరాజ్ ఒక్కడే కావడం గమనార్హం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అతనికి ఉద్యోగంతోపాటు భూమి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మహ్మద్ సిరాజ్ ఇప్పుడు అత్యుత్తమ అంతర్జాతీయ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. టీమ్ ఇండియా తరఫున 29 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 78 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 15 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమం. భారత్ తరఫున 44 వన్డేల్లో 71 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 16 టీ20 ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. ఇందులో 14 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

డీఎస్పీ నియామక పత్రాలతో సిరాజ్..

అభిమానుల అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..