Ravi Shastri: ‘వారు సహచరులే.. వరల్డ్‌కప్ తర్వాత అతనే కెప్టెన్’.. టీమిండియాపై మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యాలు..

Ravi Shastri: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా ఉండేవారు.. కానీ ఇప్పుడైతే అంతా కోలీక్స్ మాత్రమే. రెండింటికీ చాలా తేడా ఉంది’ అని రవిచంద్రన్ అశ్విన్ అన్న సంగతి తెలిసిందే. అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలపై..

Ravi Shastri: ‘వారు సహచరులే.. వరల్డ్‌కప్ తర్వాత అతనే కెప్టెన్’.. టీమిండియాపై మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యాలు..
Ravi Shastri on Ashwin and Hardik

Updated on: Jun 25, 2023 | 7:40 PM

Ravi Shastri: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా ఉండేవారు.. కానీ ఇప్పుడైతే అంతా కోలీక్స్ మాత్రమే. రెండింటికీ చాలా తేడా ఉంది’ అని రవిచంద్రన్ అశ్విన్ అన్న సంగతి తెలిసిందే. అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ‘జట్టులోని ఆటగాళ్లు నాకు ఎప్పుడూ సహచరులే. సహచరులుగా ఉండే స్నేహితులు ఉంటారు. మీకు ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరైనా అడిగితే నలుగురు లేదా ఐదుగురు అంటారు. నాకు ఉన్న ఐదురురు స్నేహితులతో సంతోషంగా ఉన్నా. అంతకుమించి నాకు అవసరం లేదు’ అని రవిశాస్త్రి ముక్కుసూటి సమాధానం ఇచ్చాడు.

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టుల్లో కనిపించకపోవడంపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. హార్దిక్‌ని టెస్టుల్లో చూడలేకపోతున్నామని, వన్డే వరల్డ్‌కప్ తర్వాత పాండ్యా టెస్ట్ కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇంకా అతని శరీరం టెస్ట్ క్రికెట్‌ను ఎదుర్కోలేకపోతుందని, కానీ ప్రపంచకప్ తర్వాత టెస్ట్ టీమ్‌ని అతను నడిపించాలని నేను భావిస్తున్నానని తెలిపాడు. అయితే వన్డే ప్రపంచకప్ టోర్నీకి రోహిత్ కెప్టెన్, ఆ విషయంలో ఏ సందేహం లేదని శాస్త్రి అన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆడనున్న వన్డే సరీస్‌కి హార్దిక్ భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే..

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..