WTC Final: బంగ్లాపై సిరీస్ విజయంతో భారత్‌కు ఊరట.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో ఫైనల్స్‌కు చేరేందుకు భారత జట్టుకు మార్గం సుగమమైంది. ఊహించినట్లుగానే రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్‌ను ఓడించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో విజయం సాధించి బంగ్లాను వైట్‌వాష్ చేసింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో ఫైనల్స్‌కు చేరేందుకు భారత జట్టుకు మార్గం సుగమమైంది. ఊహించినట్లుగానే రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్‌ను ఓడించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో విజయం సాధించి బంగ్లాను వైట్‌వాష్ చేసింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. తొలి టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ విజయ శాతం 71.67గా ఉంది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ను ఓడించడంతో గెలుపు శాతం 74.24కి చేరుకుంది. దీంతో ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోఉంది. ఇక మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయాల పరంపర కొనసాగించాల్సి ఉంది. మరోవైపు ఈ ఓటమితో బంగ్లాదేశ్ దెబ్బతింది. పాకిస్థాన్‌ను ఓడించి ఆజట్టు మూడో స్థానానికి చేరుకుంది. అయితే ఇప్పుడు రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓటమితో గెలుపు శాతం 39.29 నుంచి 34.37కి చేరింది. ఆ జట్టు ఐదో స్థానం నుంచి నేరుగా ఆరో స్థానానికి కూడా పడిపోయింది. భారత్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
ఫైనల్స్‌లో చోటు దక్కించుకునేందుకు భారత్ ఈ 8 మ్యాచ్‌లపైనే ఆధారపడాలి. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత భారత్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ ముందు ఆస్ట్రేలియా సిరీస్ అసలైన సవాల్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. కనుక న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఆస్ట్రేలియాపై కేవలం రెండు విజయాలు మాత్రమే అవసరం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే రెండు సార్లు భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2019–21లో, వారు ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డారు. ఆ తర్వాత భారత్‌పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2021-2023 టోర్నీ మళ్లీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
జైషా అభినందనలు..
Great performance by team India as they completed the series win 2-0. All our bowlers, @ashwinravi99, @imjadeja, @Jaspritbumrah93 have put on an incredible show in restricting the Bangladesh batters. The intent and aggression of our batters from the word go defined the test… pic.twitter.com/V0mJIXtkYo
— Jay Shah (@JayShah) October 1, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..