Ashwin: రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు.. ఏకైక బౌలర్‌గా…
టీమిండియా బంగ్లాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టింది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన టీమిండియా స్టార్ బౌలర్ ఆశ్విన్ సరికొత్త రికార్డును సాధించాడు. ఆ రికార్డు ఏంటంటే?
కాన్పూర్‌లో భారత్ బంగ్లా టెస్ట్ మ్యాచ్ రెండు రోజులు కూడా ఆట సాగలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. అందరూ మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్నారు. కానీ టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ఆటతో మ్యాచ్‌ను గెలిపించారు. దీంతో బంగ్లాదేశ్‌తో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్‌లో టాస్ గెలిచి రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకొని ఒక్కసారిగా అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి నుంచి రోహిత్ సేన సంచలన నిర్ణయాలతో, అసాధరణమైన ఆటతో అందరిని అవాక్కయ్యేలా చేస్తూ వస్తుంది. ఎవరు కలలో కూడా ఊహించని ఈ మ్యాచ్‌లో విజయాన్ని అలవోకగా సాధించింది.
కాన్పూర్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయం కోసం టీమిండియా తీవ్రంగా ప్రయత్నించిం. చివరి రోజు బంగ్లాదేశ్‌ను 146 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. బంగ్లా ఆటగాళ్లు షద్మాన్ ఇస్లామ్ 50 పరుగులు చేయగా, ముష్ఫికర్ రహీమ్ 37 పరుగులు చేశారు. మిగిత బంగ్లా ఫ్లేయర్లు పెద్దగా ఆడలేదు. 95 పరుగులను బంగ్లా భారత్‌కు టార్గెట్‌గా ఇచ్చింది. 95 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనింగ్ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ(8), గిల్(6) పరుగులు చేసి ఔటైయ్యారు. యశస్వి జైస్వాల్(51) హాఫ్ సెంచరీ చేసి ఔటైయ్యాడు. అనంతరం పంత్, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు.
కాగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 1 టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మొత్తం ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటివరకు భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధికంగా వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. జహీర్ ఖాన్ 7 టెస్ట్ మ్యాచ్‌లో 31 వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ 8 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీసి ఘనత సాధించాడు. వర్డల్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023-25లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 10 మ్యాచ్‌లో 53 వికెట్లు అశ్విన్ తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ 11 మ్యాచ్‌లో 51 వికెట్లు తీశాడు. అశ్వి్న్ మొదటి స్థానంలో ఉంటే రెండు స్థానంలో హేజిల్‌వుడ్ ఉన్నాడు.