AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : ఓడినా తగ్గని మనోధైర్యం.. ఇంగ్లండ్ గడ్డపై చివరి వరకు పోరాడిన నలుగురు భారత వీరులు వీరే

Team India : ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయినా శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జట్టు ఓడినా చివరి వరకు పోరాడిన ఈ నలుగురు భారత ఆటగాళ్లు అభిమానుల ప్రశంసలు అందుకున్నారు.

Team India : ఓడినా తగ్గని మనోధైర్యం.. ఇంగ్లండ్ గడ్డపై చివరి వరకు పోరాడిన నలుగురు భారత వీరులు వీరే
Ind Vs Eng (1)
Rakesh
|

Updated on: Jul 12, 2026 | 7:55 PM

Share

Team India : భారత టీ20 క్రికెట్ జట్టుకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఐర్లాండ్ పర్యటనలో చవిచూసిన పరాజయాల తర్వాత, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ భారత్ 0-4తో ఘోరంగా ఓడిపోయింది. శనివారం జరిగిన ఆఖరి ముగింపు మ్యాచ్‌లో సైతం టీమిండియా 56 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ సిరీస్ పొడవునా భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో కీలకమైన క్యాచ్‌లు వదిలేయడం ఇంగ్లండ్ బ్యాటర్లకు వరంగా మారింది. అయితే జట్టు ఇంతలా ఓడిపోతున్నా, కొంతమంది భారత ఆటగాళ్లు మాత్రం మైదానంలో పట్టుదలతో నిలబడి ఇంగ్లండ్ జట్టుకు గట్టి పోటీ ఇచ్చారు.

బ్యాటింగ్‌లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యూహాలు ఫలించకపోవచ్చు, ఆయన కెప్టెన్సీలో జట్టు వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఒక బ్యాటర్‌గా ఆయన తన బాధ్యతను నూటికి నూరు శాతం నెరవేర్చారు. ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, అలాగే ఓవరాల్ సిరీస్‌లోనే రెండో బెస్ట్ బ్యాటర్‌గా నిలిచారు. రెండో ఎండ్ నుంచి తగిన సహకారం అందకపోయినా అయ్యర్ ఒంటరి పోరాటం చేస్తూ రెండు అద్భుతమైన హాఫ్ సెంచరీలు బాదారు. ఈ సిరీస్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 54.50 సగటుతో, 157.97 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 218 పరుగులు చేశారు. ఇందులో మొదటి మ్యాచ్‌లో చేసిన 68 పరుగులు, నాల్గో మ్యాచ్‌లో చేసిన నాటౌట్ 80 పరుగుల ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచాయి.

అభిషేక్ శర్మ మెరుపులు

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆయన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించారు. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిసిన అభిషేక్, రెండో మ్యాచ్‌లో 43 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివరి మూడు మ్యాచ్‌లలో ఆయన కేవలం 29 పరుగులకే పరిమితం కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన అభిషేక్ శర్మ, 5 మ్యాచ్‌ల్లో మొత్తం 131 పరుగులు సాధించారు. వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ వంటి సహచర ఓపెనర్లు క్రీజులో ఇబ్బంది పడుతున్నా, అభిషేక్ మాత్రం జట్టుకు మంచి పునాది వేసేందుకు ప్రయత్నించారు.

ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ వృధా

ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో మిశ్రమ ప్రదర్శన ఇచ్చారు. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, రెండో మ్యాచ్‌లో 49 పరుగులతో ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత మూడు, నాల్గో మ్యాచుల్లో వరుసగా 13, 4 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచారు. అయితే, లండన్ వేదికగా జరిగిన ఐదో ఆఖరి మ్యాచ్‌లో కిషన్ పాత ఫామ్‎ను అందుకున్నారు. ఆయన మైదానంలో ఉన్నంతసేపు భారత్ గెలుస్తుందనే నమ్మకం కలిగింది. కేవలం 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ సిరీస్‌లో కిషన్ మొత్తం 122 పరుగులు చేశారు.

సపోర్ట్ లేకపోయినా వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ భారత్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మాత్రం పవర్‌ప్లేలోనే భారత్‌కు వికెట్లు అందిస్తూ ఇంగ్లండ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఐదు మ్యాచ్‌ల్లో ఆయన 4 వికెట్లు పడగొట్టారు. రెండో వైపు నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో అర్ష్‌దీప్ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ చెరో 7 వికెట్లతో చెలరేగగా, భారత బౌలర్లలో హర్షిత్ రాణా కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగారు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో భారత జట్టుకు ఇంగ్లండ్ టూర్‌లో అనుభవజ్ఞులైన బౌలర్ల లోటు స్పష్టంగా కనిపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us