AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : రేపటి నుంచే టీమిండియా వార్మప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

IND vs SL : భారత్, శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 7 నుంచి శ్రీలంక XIతో మూడు రోజుల మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా జరిగే ఈ పోరును ఎప్పుడు, ఎక్కడ చూడాలి? టీవీ ప్రసారం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు, ఇరు జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

IND vs SL : రేపటి నుంచే టీమిండియా వార్మప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?
Ind Vs Sl
Rakesh
|

Updated on: Aug 06, 2026 | 5:35 PM

Share

IND vs SL : భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి 2 మ్యాచ్‌ల ఉత్కంఠభరిత టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక వాతావరణం, పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు కొలంబోలోని నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో శ్రీలంక XI జట్టుతో 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 7వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రధాన టెస్టు సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లు తమ ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఈ మ్యాచ్ మంచి అవకాశంగా మారనుంది.

టీమిండియాకు సాయి సుదర్శన్ దూరం

భారత జట్టుతో తలపడే శ్రీలంక XI జట్టులో అనుభవజ్ఞులతో పాటు యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. జూన్-జులైలో ఇండియా-ఏ తో ఆడిన శ్రీలంక-ఏ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్థానం సంపాదించారు. కాగా ఈ వార్మప్ మ్యాచ్‌కి టీమిండియా యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా ఆయన ఇంకా శ్రీలంక చేరుకోలేదని సమాచారం. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఇప్పటికే ఈ మొత్తం టెస్ట్ సిరీస్ నుంచే వైదొలిగిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

మ్యాచ్ తేదీ: ఆగస్టు 7 (శుక్రవారం) నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది.

మ్యాచ్ వేదిక: కొలంబోలోని నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్.

మ్యాచ్ ప్రారంభ సమయం: భారత కాలమానం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

టీవీ లైవ్ ప్రసారం: భారతదేశంలో ఈ వార్మప్ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

లైవ్ స్ట్రీమింగ్ : ఈ మ్యాచ్ డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ సోనీ లివ్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. క్రీడాభిమానులు తమ మొబైల్‌లో నేరుగా లైవ్ చూడవచ్చు.

ఇరు జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు

భారత స్క్వాడ్ :

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్, ఆకిబ్ నబీ.

శ్రీలంక XI స్క్వాడ్ :

నిషాన్ మదుష్క, రవిందు రషంత, పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినూషా (కెప్టెన్), అంజల బండార (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసంత మనోజ్, ఇసిత విజేసుందర, రమేష్ మెండిస్, కేసరి నువంత, దిలుమ్ సుదీర.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డ్రా అయితే.. డబ్ల్యూటీసీ నుంచి టీమిండియా ఔట్?
డ్రా అయితే.. డబ్ల్యూటీసీ నుంచి టీమిండియా ఔట్?
ఆడియో దిగ్గజం మివి స్మార్ట్‌ఫోన్ చూశారా? డిజైన్​, ఫీచర్ల వివరాలు
ఆడియో దిగ్గజం మివి స్మార్ట్‌ఫోన్ చూశారా? డిజైన్​, ఫీచర్ల వివరాలు
పబ్లిక్ పార్కుల్లో పండ్లు, కూరగాయలు పూర్తిగా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!
పబ్లిక్ పార్కుల్లో పండ్లు, కూరగాయలు పూర్తిగా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!
నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు..
నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు..
అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. ఒంటరిగా ఇంట్లో ఉండగా..
అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. ఒంటరిగా ఇంట్లో ఉండగా..
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..