Team India: గుడ్‌న్యూస్.. రోజూ 7 ఓవర్ల బౌలింగ్.. త్వరలో ప్రాక్టీస్ మ్యాచ్.. రీఎంట్రీకి సిద్ధమైన యార్కర్ కింగ్..
Jasprit Bumrah Practice: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని పునరాగమనంపై కీలక అప్డేట్ వచ్చింది.
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ మేరకు నెట్ ప్రాక్టీస్ సమయంలో 7 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. రానున్న ఐసీసీ ఈవెంట్ల కోసం బుమ్రా ఫిట్‌గా మారడం తప్పనిసరిగా మారింది. అయితే గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియాకు ఎప్పుడు తిరిగి వస్తాడో మాత్రం తెలియడం లేదు.
అయితే, నెట్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయడం చూస్తుంటే.. 2023 వన్డే ప్రపంచకప్‌లో తప్పకుండా చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో విడుదలైన ఫొటోలు, వీడియోలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది . ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ నుంచి బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వస్తాడని అనేక నివేదికలల్లో వినిపిస్తోంది.
వెన్ను సమస్య కారణంగా మార్చిలో బుమ్రా న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తిరిగి ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో బుమ్రా తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో లేదా ఆసియా కప్‌లో బుమ్రా పునరాగమనం చేస్తాడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బుమ్రా పునరాగమనంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని భారత జట్టు మాజీ ‘స్ట్రెంత్ అండ్ కండిషనింగ్’ కోచ్ రామ్‌జీ శ్రీనివాసన్ అన్నారు. ఈ విషయంలో అస్సలు తొందరపడకూడదని అన్నారు. NCAలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం మంచి దశ. ఇది మ్యాచ్ డిమాండ్‌ల కోసం అతని శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. అతను ఉన్నత స్థాయి క్రికెట్‌లోకి తీసుకురావడానికి ముందు కొన్ని దేశీయ మ్యాచ్‌లు ఆడాలి అని తెలిపారు.
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా NCAలో ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా గాయం నుంచి కోలుకోవడంలో మంచి పురోగతి సాధిస్తున్నారు. రాహుల్‌కి లండన్‌లో తొడ శస్త్రచికిత్స జరగగా, శ్రేయాస్‌కు నడుముకు లోయర్ సర్జరీ జరిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..