ప్రపంచకప్‌లో కథ ముగియడంతో టీమిండియా.. ఆదివారం స్వదేశానికి పయనం కానుంది. ‘ఆటగాళ్లందరూ తలో చోటికి వెళ్లారు. 14న అందరూ కలుసుకొని లండన్ నుంచి ముంబై చేరుకుంటార’ని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రపంచకప్ ఫైనల్ జరిగే రోజే భారత జట్టు స్వదేశానికి బయల్దేరనుంది. బ్రేక్ రావడంతో ఆటగాళ్లు తమకు నచ్చిన చోటుకు వెళ్తున్నారని తొలుత వార్తలు వచ్చాయి. కాగా, మెగా టోర్నీ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ధోనీ ఇప్పటికే తన చివరి మ్యాచ్ ఆడేశాడని కొందరు మాజీలు వ్యాఖ్యానించడాన్ని బట్టి రిటైర్మెంట్‌పై ధోనీ స్పష్టతకు వచ్చేశాడన్న వాదన వినిపిస్తోంది. సహచర ఆటగాళ్లతో కలిసి ముంబయి చేరుకున్న ధోని అక్కడి నుంచి నేరుగా రాంచీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.