IND vs SA: దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి కోహ్లీ ఔట్.. బీసీసీఐకి షాకిచ్చిన రన్ మెషీన్.. ఎందుకంటే?

India vs South Africa: భారత్‌ దక్షిణాఫ్రికా టూర్‌కు సంబంధించి ఓ కీలక వార్త వినిపిస్తోంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లోని మొదటి 6 మ్యాచ్‌ల నుంచి విరాట్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్‌లో జరిగే 6 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. విరాట్ తన నిర్ణయాన్ని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం.

IND vs SA: దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి కోహ్లీ ఔట్.. బీసీసీఐకి షాకిచ్చిన రన్ మెషీన్.. ఎందుకంటే?
Virat Kohli Ind Vs Sa Tour

Updated on: Nov 29, 2023 | 12:22 PM

డిసెంబరు 10 నుంచి భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. కానీ, అంతకు ముందు ఈ టూర్‌లో టీ20 ఇంటర్నేషనల్, వన్డే ఆడేందుకు విరాట్ కోహ్లీ నిరాకరించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో 3 T20, 3 ODIలు కాకుండా, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విరాట్ కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో వన్డే, టీ20 ఆడబోవడం లేదని, వైట్ బాల్ సిరీస్‌కు విరామం ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే, టెస్టు సిరీస్‌లో ఆడతాడా? అనే ప్రశ్నపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లలో విరాట్ ఆడటం చూడొచ్చని తెలుస్తోంది.

తన నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పిన విరాట్ కోహ్లీ..

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును ఇంకా ఎంపిక చేయలేదు. దీనికి సంబంధించి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో సమావేశం కానుంది. ఆ సమావేశానికి ముందు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెలక్షన్ కమిటీ గురించి ఓ వార్తలను ప్రచురించింది. వైట్ బాల్ సిరీస్ నుం,ఇ విరామం తీసుకోవాలని కోహ్లీ బీసీసీఐ, సెలెక్టర్లకు చెప్పినట్లు పేర్కొంది. అలాగే, అతను రెడ్ బాల్ క్రికెట్‌లో ఆడతానని బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి అతను దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌లో ఆడగలడని స్పష్టమవుతోంది.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ 2 టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో తొలి టెస్టు జరగనుంది. కాగా, రెండో టెస్టు 2024 జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది.

విరాట్ కోహ్లీ లండన్‌లో విహారయాత్ర..

2023 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 765 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ లండన్‌లో హాలిడేలో ఉన్నాడు. అంతకుముందు, అతను ఈ ఏడాది సెప్టెంబర్‌లో వైట్ బాల్ క్రికెట్‌కు విరామం తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..