Video: పింక్ బాల్ టెస్ట్‌కు ముందు రోహిత్ సేనకు గుడ్‌న్యూస్.. ఆస్ట్రేలియాకు మాత్రం హార్ట్ ఎటాక్ పక్కా

|

Nov 29, 2024 | 12:32 PM

అడిలైడ్‌లో జరగనున్న పింక్ బాల్ టెస్టుకు ఇంకా 1 వారం సమయం ఉంది. దీనికి ముందు భారత జట్టుకు ఓ శుభవార్త వచ్చింది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరగనుంది. ఈ మేరకు కాన్ బెర్రాలో ప్రాక్టీస్ చేసిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్ గణాంకాలు మార్చేలా కనిపిస్తోంది.

Video: పింక్ బాల్ టెస్ట్‌కు ముందు రోహిత్ సేనకు గుడ్‌న్యూస్.. ఆస్ట్రేలియాకు మాత్రం హార్ట్ ఎటాక్ పక్కా
Shubman Gill
Follow us on

IND vs AUS: పెర్త్‌ టెస్టులో విజయం సాధించిన భారత్ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో జరగబోయే రెండవ టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. ఈ టెస్ట్ పింక్ బాట్ టెస్ట్. అంటే డే-నైట్ జరగనుంది. రెండో మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. ఇందులో టీమ్ ఇండియాకు పెద్దగా అనుభవం లేదు. అందుకే ఈ మ్యాచ్ చాలా క్లిష్టంగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కి ఇంకా 1 వారం సమయం ఉంది. దీనికి ముందు, ఒక పెద్ద గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది భారతీయ అభిమానులను ఆనందపరుస్తుంది. కానీ ఆస్ట్రేలియాకు మాత్రం టెన్షన్‌ను పెంచుతుంది.

గాయం నుంచి కోలుకున్న శుభమాన్ గిల్..

పింక్ బాల్ టెస్ట్‌కు ముందు, రోహిత్ శర్మ జట్టు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు కాన్‌బెర్రా చేరుకున్నారు. ఈ సమయంలో, టీమ్ ఇండియా తరుపున 3వ స్థానంలో ఆడిన శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బొటనవేలికి గాయం కావడంతో పెర్త్ టెస్టులో పాల్గొనలేకపోయాడు. మీడియా కథనాల ప్రకారం, అతను ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అతని బొటన వేలికి ఉన్న కట్టు పూర్తిగా తొలగించారు.

ఇవి కూడా చదవండి

నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లు ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, యశ్ దయాల్‌లపై గిల్ బ్యాటింగ్ చేశాడు. అతని పునరాగమనం టీమ్ ఇండియాకు చాలా కీలకం. ఎందుకంటే అతను చాలా కాలంగా 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది కాకుండా ఆస్ట్రేలియాలో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. గిల్ ఆస్ట్రేలియాలో 3 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 259 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గిల్ లేకపోవడంతో, అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడాడు.

గిల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడా?

భారత జట్టు నెట్ సెషన్‌లో శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అయితే, అతను డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అనే దానిపై ఎటువంటి అప్‌డేట్ రాలేదు. అయితే, అడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది. నవంబర్ 29న భారత జట్టు కాన్‌బెర్రాలో ప్రాక్టీస్ చేయనుంది. ఆ తర్వాత, నవంబర్ 30, డిసెంబర్ 1న ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో రెండు రోజుల మ్యాచ్‌లు ఆడిన తర్వాత, డిసెంబర్ 2న అడిలైడ్‌కు బయలుదేరుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..