Video: గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిన క్రికెటర్‌.. టీ20 మ్యాచ్‌లో ఊహించని ఘటన

ఓపెనర్‌గా బ్యాటింగ్‌కి వెళ్లాడు.. దూకుడుగా ఆడుతున్నాడు.. అప్పటివరకూ అంతా బాగానే ఉంది.. ఉన్నట్టుండి సడన్‌గా కుప్పకూలిపోయాడు.. హార్ట్‌ ఎటాక్‌ ఓ యువ క్రికెటర్‌ ప్రాణాలు తీసేసింది.

Video: గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిన క్రికెటర్‌.. టీ20 మ్యాచ్‌లో ఊహించని ఘటన
T20 Cricketer Died
Follow us
Venkata Chari

|

Updated on: Nov 29, 2024 | 11:48 AM

పుణెలో జరుగుతున్న AS ట్రోఫీ టీ20 చాంపియన్‌షిప్‌కి మంచి క్రేజ్‌ ఉంది. ఈ క్రమంలో డేనైట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇమ్రాన్‌ పటేల్‌, లకీ బిల్డర్స్‌ టీమ్‌ తరపున ఆడుతున్నాడు. 6 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఇమ్రాన్‌ అస్వస్థతకు గురవడంతో అంపైర్లకు విషయాన్ని చెప్పాడు. ఆ వెంటనే ఇమ్రాన్‌ను వెంటనే రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. గ్రౌండ్‌ నుంచి వెనుదిరుగుతున్న సమయంలో కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారంతా హుటాహుటిన ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈలోపే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తోటి క్రీడాకారులు విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..