
IND vs SA Test Series: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య సుధీర్ఘ సిరీస్ నవంబర్ 14, 2025న ప్రారంభం కానుంది. దాదాపు ఒక నెల పాటు కొనసాగే ద్వైపాక్షిక సిరీస్ కోసం అనేక మంది స్టార్ ఆటగాళ్లను జట్టులో చేర్చగా, గాయం కారణంగా ఆఫ్రికాలో మొత్తం సిరీస్ నుంచి ఓ ప్లేయర్ దూరమయ్యాడు.
టీమిండియా ఆటగాడి గాయం చాలా తీవ్రంగా ఉంది. అతను క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడానికి కనీసం ఒకటి నుంచి రెండు నెలలు పట్టవచ్చు. గాయపడిన ఆటగాడు ఎవరు, మొత్తం సిరీస్ నుంచి ఎందుకు తప్పుకున్నాడో ఓసారి చూద్దాం..
దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకున్న ఆటగాడు మరెవరో కాదు, వన్డే జట్టు (Team India) వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో శ్రేయాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉంచారు.
అక్టోబర్ 25న సిడ్నీలో భారత్ vs ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ చివరి మ్యాచ్‌లో, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అలెక్స్ కారీ అందించిన అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. కానీ, డైవ్ చేస్తున్నప్పుడు, అతను తన ప్లీహానికి గాయమై నేలపై పడిపోయాడు. దీని వలన అంతర్గత రక్తస్రావం జరిగింది.
అయ్యర్ గాయం మొదట్లో చిన్నదిగా పరిగణించబడినప్పటికీ, డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక సమయంలో, అతని ఆక్సిజన్ స్థాయి 50కి పడిపోయిందంట. దీంతో అతను దాదాపు 10 నిమిషాల పాటు సరిగ్గా నిలబడలేకపోయాడు, అతని చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి. ఆ సమయంలో అయ్యర్ పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చారు.
అయితే, అయ్యర్ ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు. కోలుకుంటున్నాడు. కానీ సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, అతను గాయం నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. దీంతో అతను నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..