Champions Trophy: ఆ లీగ్ ఫైనల్ మ్యాచ్ తర్వాతే భారత జట్టు ఎంపిక.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించి తొలి రౌండ్‌లో ఆయా గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Champions Trophy 2025: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఈ ఎనిమిది జట్లలో ఇప్పటికే 6 జట్లను ప్రకటించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య పాకిస్థాన్, భారత్ జట్లను ప్రకటించలేదు.
బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించకపోవడానికి విజయ్ హజారే టోర్నమెంట్ (వీహెచ్‌టీ) ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ విజయ్ హజారే టోర్నీలో కొందరు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ఆ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలంటే ఫైనల్ మ్యాచ్ వరకు వేచి చూడాలని నిర్ణయించారని తెలుస్తోంది.
విజయ్ హజారే టోర్నీ ఫైనల్ మ్యాచ్ జనవరి 18న జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం సెలక్షన్ కమిటీ తుది సమావేశం నిర్వహించి, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్రకటన వెలువడనుంది. అంటే, జనవరి 19 ఆదివారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్లు పోటీపడతాయి?
గ్రూప్-ఏ
భారతదేశం
పాకిస్తాన్
న్యూజిలాండ్
బంగ్లాదేశ్
గ్రూప్-బి
దక్షిణాఫ్రికా
ఆస్ట్రేలియా
ఆఫ్ఘనిస్తాన్
ఇంగ్లండ్
టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:
భారత్ vs బంగ్లాదేశ్: ఫిబ్రవరి 20 (దుబాయ్)
భారత్ vs పాకిస్థాన్: ఫిబ్రవరి 23 (దుబాయ్)
భారత్ vs న్యూజిలాండ్: మార్చి 2 (దుబాయ్)
సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 4 (దుబాయ్)
ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 9 (దుబాయ్)
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు, లెజెండ్ సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్‌లు పేర్కొన్న 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఎలా ఉండో ఓసారి చూద్దాం..
భారత ప్రాబబుల్ వన్డే జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ సిరాజ్.