Vinod Kambli: ‘మీ సాయం మరువలేను’.. గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకల్లో అందరి దృష్టి వినోద్ కాంబ్లీ పైనే నిలిచింది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ఆయన ఈ వేడుకలో చాలా హుషారుగా కనిపించాడు. అంతేకాకుండా ఇదే వేడుకకు హాజరైన సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించాడు. ఇది అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. 50వ వార్షికోత్సవ ప్రధాన వేడుక జనవరి 19న జరగనుంది. కానీ, అంతకు ముందు, ముంబై రంజీ కెప్టెన్‌లను ఆదివారం (జనవరి 12) ముంబై క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ, వసీం జాఫర్, పృథ్వీ షా వంటి పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ అందరికీ జ్ఞాపికలు అందజేశారు. వాఖ్‌నెడే స్టేడియంలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ఆటగాళ్లందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అయితే అందరి దృష్టి వినోద్ కాంబ్లీ వైపే నిలిచింది. ఆరోగ్యం విషమించడంతో కొద్ది రోజుల క్రితం ఈ క్రికెటర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ నుండి కపిల్ దేవ్ వరకు చాలా మంది అతనికి సహాయం చేశారు.
చాలా రోజుల పాటు చికిత్స తీసుకున్న వినోద్ కాంబ్లీ ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి లో కాంబ్లీ ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఆ తర్వాత అతను విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవానికి వినోద్ కాంబ్లీ కూడా హాజరయ్యాడు. అయితే ఈసారి చాలా ఫిట్‌గా,హెల్దీగా కనిపించాడీ క్రికెటర్. ఈ కార్యక్రమానికి హాజరైన సునీల్ గవాస్కర్‌ను వినోద్ కాంబ్లీ కలవడం, వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
వాంఖడే స్టేడియం వార్షికోత్సవాల్లో క్రికెటర్లు..
Vinod Kambli meets Sunil Gavaskar and Prithvi Shaw at the felicitation ceremony for Mumbai players during Wankhede Stadium’s 50-year celebrations 🫂🏏#CricketTwitter pic.twitter.com/9fxG6kYGsb
— Sportskeeda (@Sportskeeda) January 12, 2025
వినోద్ కాంబ్లీకి తనపై ఉన్న ప్రేమ, గౌరవం చూసి గవాస్కర్ కూడా పొంగిపోయారు. కాంబ్లీని గట్టిగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. శివాజీ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసిన సునీల్ గవాస్కర్ కాంబ్లీకి ఆపన్నహస్తం అందించారు. అంతేకాదు వినోద్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరినప్పుడు సన్నీ ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ కారణంగానే గవాస్కర్‌కు కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపాడు.
Vinod Kambli’s inspiring appearance at Wankhede’s 50th anniversary, alongside Prithvi Shaw, marks a hopeful comeback after health battles. Former India captain Sunil Gavaskar also graced his presence for the event. # vinod kambli# get well soon# met old cricketers#team mates# pic.twitter.com/2XXcVcmwwS
— The Media Times (@themediatimes_) January 13, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..